వైసీపీ, జనసేన, వామపక్షాలతోనే బాబుకు చెక్!

 

పంజాబ్ లో మహా కూటమితోనే విజయం.. బీహార్ లో బద్ధ శత్రువులు జేడీయూ-ఆర్జేడీలు కలిసి పోటీ చేసి విజయం.. ఒక్క యూపీలోనే రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ బెడిసికొట్టింది. అక్కడ అఖిలేష్ పార్టీ సమాజ్ వాదీ-కాంగ్రెస్ కలిసి పోటీచేసి ఓడిపోయాయి. దీనికి కారణం యూపీలో అధికార సమాజ్ వాదీపై వ్యతిరేకత.. ఇలా కాంగ్రెస్ సానుభూత రాజకీయ విశ్లేషకుడు వేసిన ప్లాన్ లు దాదాపు 90శాతం హిట్ అయ్యి కాంగ్రెస్ కు అధికారం దక్కేలా చేశాయి. ప్రశాంత్ ను ఫేమస్ చేశాయి.

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ .. ప్రశాంత్ కిషోర్ ను కలిసి ఏపీలో రాజకీయ సమీరణాలపై ప్లాన్ రెడీ చేయించాడు. ఇందుకోసం దాదాపు 250కోట్లు వెచ్చించినట్టు ఇన్ సైడ్ టాక్. ఎలాగైనా వచ్చేసారి గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్ .. 2019 ఎన్నికల్లో ఏపీలోనే ఉండి ప్రణాళికలు రచించాలని ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఆయన గడిచిన రెండు నెలలుగా తన పని ప్రారంభించి ఎట్టకేలకు నివేదిక ఇచ్చారని తెలిసింది..

ప్రస్తుతం ఏపీలో ఫుల్ ఫాంలో ఉన్న టీడీపీ -బీజేపీ కూటమిని కొట్టాలంటే జగన్ ఒక్కడే సరిపోడని ప్రశాంత్ నివేదికలో తేల్చిచెప్పినట్టు సమాచారం. జగన్ ఏపీలో మహాకూటమిని ఏర్పాటు చేసి అందులో కాంగ్రెస్, జనసేన, వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి పోటీచేయాలని సూచించాడట.. దీంతో వెంటనే జగన్ పని ప్రారంభించారని తెలిసింది. కాంగ్రెస్ నేతలు ఎలాగూ వైసీపీతో కలవడానికి పెద్దగా అభ్యంతరాలు పెట్టరని తెలిసింది. ఇక జనసేన పొత్తు బాధ్యతలను ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ కాపు నేతకు జగన్ అప్పగించినట్టు తెలిసింది. ప్రత్యేక హోదా కోసం కలిసివస్తున్న పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా మహాకూటమిలో జగన్ తో కలిసి నడిచేలా ఒప్పించాలని జగన్ సదురు కాపునేతకు సూచించారని తెలిసింది.

కాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మోడీలను ఓడించేందుకు మహాకూటమే పరిష్కారమని ప్రశాంత్ నివేదిక ఇవ్వడంతో రాజకీయ వేడి రాజుకుంది. వామపక్షాలు+జనసేన ఒక్కతాటిపై ఉన్నాయి. కాంగ్రెస్, వైసీపీ కలవడం నామమాత్రమే.. హోదా కోసం ఎవరితోనైనా కలుస్తానన్న పవన్ .. ఇప్పటివరకు పార్టీ విధివిధానాలు ప్రకటించలేదు. అధికారంపై పవన్ కు ఆసక్తి లేదు. దీంతో జగన్ చొరవ తీసుకొని పవన్ తో పొత్తు పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం.. ఇదే విషయాన్ని ప్రశాంత్ చెప్పడంతో వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా ప్రశాంత్ నివేదిక.. జగన్ మహాకూటమి కోసం తహతహలాడుతుండడంతో ఏపీలో రాజకీయ కాక మొదలైంది.

To Top

Send this to a friend