ఆంధ్రజ్యోతి, జగన్ ఫైట్ కీలక మలుపు


మోడీ-జగన్ భేటిలో ఏం జరిగిందనేదానిపై నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో వేసిన కథనం ఏపీలో కుదేపిస్తోంది. ఇది అబద్ధమని స్వయంగా వైఎస్ జగన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ నిజానిజాల్ని వెల్లడించారు. జగన్ మోడీకి ఫిబ్రవరి 17న రాసిన లేఖను పట్టుకొని తాజాగా మే 10న కలిసిన దానికి అన్వయించి ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు కథనం రాసిందని ఆధారాలు బయటపెట్టారు. ఈరోజు సాక్షి పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రిక కథనం తప్పు అని వివరణ ఇచ్చారు.

సాక్షి సవివరణ కథనంతో తేరుకున్న ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రికలో మోడీ ప్రధాని కలిసి మొరపెట్టుకున్నది వాస్తవమేనని.. అది ఇప్పుడా అప్పుడా తేది సమస్య కాదని పత్రికలో ప్రచురించింది. ఇటు జ్యోతి, అటు సాక్షి, జగన్ పోటాపోటీ లేఖల లొల్లి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వైసీపీని టార్గెట్ చేసి టీడీపీ ఆడుతున్న నాటకాలకు వైసీపీ గట్టిగా బదులిస్తోంది. తప్పుడు కథనాలను రాసిన ఆంధ్రజ్యోతిని నిషేధిస్తున్నామని.. దానిపై పరువు నష్టం దాా వేస్తామని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.

ఇందులో కీలకమైన మలుపు ఏంటంటే.. జగన్ ఫిర్యాదు చేసింది ఇద్దరు ఈడీ అధికారుల మీదట.. వారు గాంధీ, ఉమాశంకర్ గౌడ్ లు.. వీరిద్దరికి టీడీపీతో సన్నిహిత సంబంధాలున్నాయని జగన్ ప్రెస్ మీట్ లో చెప్పాడు. దీనిపై కేంద్రం కూడా ఆరాతీస్తున్నట్టు తెలిసింది. వారు ఎంత కాలంగా పనిచేస్తున్నారు. ఎవరికి సహకరిస్తున్నారనే విషయాలపై ఆరాతీస్తోందట… త్వరలోనే కేంద్రం వారిని బదిలీ చేయనుందని సమాచారం. టీడీపీ, బీజేపీకి మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో జగన్ చెప్పినట్టు కేంద్రం ఈడీ అధికారులను బదిలీచేస్తుందా లేదా అన్నది ప్రస్తుతం చిక్కు ప్రశ్న..

అంతేకాదు.. నోట్ల రద్దు సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక బ్యాంకు ఖాతాలో ఒకే రోజు ఒకే బ్యాంకులో భారీగా నల్లడబ్బు జమ అయ్యిందని కొన్ని ఆధారాలను జగన్ ప్రధాని మోడీకి ఇచ్చినట్టు సమాచారం. అందుకే ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ చేశారని.. దీన్ని కప్పిపుచ్చుతున్నారని.. ఆ అక్రమ డబ్బు వెలికి తీయాలని జగన్ ప్రధానిని కోరినట్టు తెలిసింది. ఇలా వైసీపీ, ఆంధ్రజ్యోతి మధ్య యుద్ధానికి సంబంధించి జగన్, రాధాకృష్ణ ల ఫైట్ ప్రస్తుతం రంజుగా ఉంది.

To Top

Send this to a friend