పాపం వేణుమాధవ్.. బుక్కైపోయాడు.

పాపం వేణుమాధవ్.. బుక్కైపోయాడు.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానురా దేవుడా అనేలా బాధపడిపోతున్నాడు.. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చి చంద్రబాబు సమక్షంలో రెచ్చిపోయి విమర్శ చేసిన కమెడియన్ వేణుమాధవ్ కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.. జగన్ అభిమాని ఒకరు వేణుమాధవ్ ను తిడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు సంచలనంగా మారింది. ‘‘ గొట్టంగాడు, పొట్టినా కొడుకు, గుడ్డలు ఊడదీసి కొడతాం.., మూడు అడుగుల నా కొడుకు, రోగిష్టి నా కొడుకా..?’’ ఇలా తెలుగులో ఉన్న బూతులన్నీ కలగలపి జగన్ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనంగా మారింది. కొన్ని రాయడానికి కూడా వీలులేని పదాలను ప్రయోగించి టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ పై విరుచుకుపడ్డాడు వైసీపీ అభిమాని రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆగ్రహానికి కారణం ఏంటి.? ఎందుకు వేణుమాధవ్ ని తిట్టాడనేది తెలుసుకుందాం..

కమెడియన్ వేణుమాధవ్ కొద్దికాలంగా టీడీపీకి సన్నిహితంగా ఉంటున్నాడు. చంద్రబాబు పిలిచినప్పుడు వెళ్లి టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి వేణుమాధవ్ కూడా వచ్చి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజా గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రోజాను అయితే టాటూలు వేసుకుంటుందని.. పొట్టి దుస్తులు ధరిస్తుందని.. విమర్శించారు. జగన్ ను వ్యక్తిగతంగా దూషించాడు..

వేణుమాధవ్ జగన్ ను, రోజాను విమర్శించడంతో తట్టుకోలేకపోయిన ఓ జగన్ అభిమాని రాజశేఖర్ రెడ్డి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో కమెడియన్ వేణుమాధవ్ విమర్శలకు బదులిచ్చాడు. అంతేకాదు.. వేణుమాధవ్ ను నంద్యాల నడిసెంటర్ లో బట్టలూడదూసి ఉచ్చపడేలాగా కొడతామని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. జగన్ ను, రోజాను, వైసీపీని తిడితే బిడ్డా వేణుమాధవ్ నిన్ను ఊరికే వదిలిపెట్టమని అభిమాని హెచ్చరికలు పంపడం విశేషం. అంతేకాదు.. నేను తిట్టినందుకు నాపై కేసులు కూడా పెట్టుకో దమ్ముంటే అని సవాల్ విసరడం గమనార్హం.

To Top

Send this to a friend