బాబు, జగన్ ల డబ్బుల వాన..

నంద్యాల ఓటర్లపై డబ్బుల వర్షం కురుస్తోంది. మొన్నటికి మొన్న టీడీపీ ఎమ్మెల్యే కం హీరో బాలక్రిష్ణ పబ్లిగ్గా డబ్బులు పంచుతూ దొరికిపోయాడు.ఇక ఈరోజు వైసీపీ నాయకులు, సానుభూతి పరులు దాదాపు 51మందిని ఓటర్లకు డబ్బులు పంచుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కడప జిల్లాకు చెందిన యువకులు, విద్యార్థులు కావడం గమనార్హం. కడప జిల్లా కు చెందిన వైసీపీకి చెందిన ఓ కీలక ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ, పులివెందుల, కడప నేతలు ఈ డబ్బుల పంపిణీలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు..

టీడీపీ కూడా అధికార బలంతో డబ్బులు పంచుతున్నా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడకుండా టీడీపీ మంత్రులు కాపు కాస్తున్నట్టు తెలిసింది. కోట్ల రూపాయలను నంద్యాలతో పాటు మండలాల్లో నాయకులు ఇప్పటికే దాచిపెట్టినట్టు తెలిసింది. ఇదంతా మహిళల ద్వారా టీడీపీ నేతలు ఓటుకు 1000 చొప్పున పంచుతున్నారట.. ఇక 10 మంది వరకు ఇంటి సభ్యులున్న వారి ఓట్లు గంపగుత్తగా పడడానికి దాదాపు 15వేల వరకు వారికి ముట్టజెప్పుతున్నట్టు సమాచారం.

ఇలా వైసీపీ, టీడీపీ విసురుతున్న డబ్బుల వానలో నంద్యాల ఓటర్లు తడిసిముద్దవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరికీ పట్టం కడతారన్నది ఆసక్తిగా మారింది. వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచార బరిలో దిగబోతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నిక ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది.

To Top

Send this to a friend