వావ్‌.. బాహుబలి సరసన డీజే!


అల్లు అర్జున్‌ ‘డీజే’ చిత్రం కనీ విని ఎరుగని రీతిలో వసూళ్లను సాధిస్తుంది. సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ రాకున్నా, కేవలం యావరేజ్‌ టాక్‌ వచ్చినా కూడా ఏకంగా వంద కోట్లను వసూళ్లు చేసింది. ఈ వారంలో కూడా ఈ సినిమాకు పెద్దగా పోటీ లేక పోవడంతో మరో 50 కోట్ల వరకు వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు. ఇక ఈ చిత్రం రికార్డులు సాధిస్తుందని విడుదలయిన వెంటనే ఏ ఒక్కరు భావించలేదు. కాని ఏకంగా ‘బాహుబలి’ సరసన నిలిచే రికార్డును బన్నీ సొంతం చేసుకున్నాడు.

తెలుగు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్‌ షేర్‌ దాటినవి ఇప్పటి వరకు మూడే మూడు. మూడు సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లు మరియు ఆపై సాధించాయి. ఓవర్సీస్‌ మరియు ఇతర రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు సాధించిన చిత్రాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో విఫలం అయ్యాయి. అయితే ‘డీజే’ చిత్రం మాత్రం ఆ ఘనత దక్కించుకుంది.

ఇప్పటి వరకు ‘బాహుబలి’, ‘బాహుబలి 2’, ‘ఖైదీ నెం.150’ చిత్రాలు మాత్రమే తెలంగాణ మరియు ఏపీల్లో 50 కోట్లను సాధించగలిగాయి. ఆ మూడు చిత్రాల తర్వాత ఇప్పుడు ‘డీజే’ చిత్రం మాత్రమే 50 కోట్ల షేర్‌ను ను క్రాస్‌ చేసింది. లాంగ్‌ రన్‌లో మరో 15 కోట్లు వసూళ్లు సాధించి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 65 కోట్లు సాధించిన చిత్రంగా నిలువబోతుంది. ఈ లెక్కన చూస్తే చిరంజీవి సినిమాను నాల్గవ స్థానంలోకి తొక్కేసి మూడవ స్థానంలో అంటే బాహుబలి చిత్రాల తర్వాత స్థానంలో నిలుస్తుందని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

To Top

Send this to a friend