బీజేపీతో వెళ్దామా..? వైసీపీ ఎందాకైనా..

గెలవాల్సిందే.. ఎలాగైనా 2019 ఎన్నికల్లో గెలవాల్సిందే.. అందుకోసం ఎందాకైనా వెళ్లడానికి వైసీపీ అడుగులు వేస్తోంది. బలమైన నాయకుల కోసం శూలశోధన మొదలు పెట్టింది. ఇతర పార్టీలపై గురిపెట్టి ఎవరు వచ్చినా తీసుకోవాలని జగన్, ప్రశాంత్ కిషోర్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఎంత మంది నాయకులు తోడుంటే అంత ప్రజాబలమని భావిస్తున్నట్టు సమాచారం.

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ తన బృందాలతో జిల్లాల్లో సర్వేలు మొదలుపెట్టారు. వచ్చే 2019 ఎన్నికల్లో బీజేపీతో వైసీపీ వెళితే న్యాయమా .. ఏఏ నాయకులను వైసీపీలో చేర్చుకుంటే పార్టీకి లాభమనే విషయాలపై సర్వే జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

వచ్చే ఎన్నికల వేడి దృష్ట్యా అవసరమైతే బీజేపీతో కలిసి పోటీ చేసే ఆలోచనపై ఆ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపాలని పీకే బృందం ఆలోచిస్తున్నట్టు సమాచారం. జగన్ కూడా మోడీ, అమిత్ షాలతో భేటి అయ్యి రాష్ట్రంలో వైసీపీతో పొత్తు పెట్టుకునేలా ఒప్పించాలని నిర్నయించినట్టు సమాచారం. మరి 4 ఏళ్లుగా టీడీపీతో అంటకాగుతున్న బీజేపీ… జగన్ తో వెళ్తుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

To Top

Send this to a friend