జగన్ పాదాభివందనం వెనుక..?

అడకత్తెరలో పోకచెక్కలా మారిన జగన్ ఇప్పుడు ఏదీ చేసినా సంచలనమే అవుతోంది. జగన్ కు తెలుసు తన ప్రత్యర్థి టీడీపీ, దాని స్నేహితుడు బీజేపీలు ఎలాగైనా తన కేసులను తిరగదోడి 2019 ఎన్నికల నాటి మళ్లీ జైలుకు పంపొచ్చు అని.. అందుకే బీజేపీతో.. ఆ పార్టీ నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థితో మంచిగా ఉంటున్నాడు. మద్దతు ఇస్తున్నాడు.

భవిష్యత్తులో రాష్ట్రపతి మద్దతు ఉంటే లాభిస్తుందని జగన్ కు తెలుసు.. అందుకే హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు జగన్ సాదర స్వాగతం పలికారు. వైసీపీ మంది మార్బలంతో కలిసి కోవింద్ ను కలిసి సన్మానించి ఏకంగా ఆయనకు పాదాభివందనం చేసి తన భక్తిని చాటారు..

నిజానికి రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న అభ్యర్థులెవరైనా సరే దేశంలోని వివిధ పార్టీలను కలిసి మద్దతు కోరడం సహజంగానే జరుగుతుంటుంది. ఇందులో భాగంగానే కోవింద్ తో సహా కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ లు హైదరాబాద్ వచ్చారు. వారు తమ రాజకీయ పార్టీలను కలిసే పనిలో పడ్డారు..

కాగా జగన్ .. కోవింద్ కు ఇలా పాదాభివందనం చేయడం వెనుక కేసుల భయం వెంటాడడమే కారణమని వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. భవిష్యత్తులో కోవింద్ రాష్ట్రపతి అయ్యాక ఆయనతో పని ఉంటుంది కనుక.. ఇప్పుడే మచ్చిక చేసుకునే పనిలో పడ్డట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదీ కాక ప్రస్తుతం జగన్ కు బీజేపీ సపోర్టు చాలా అవసరం.. తనపై నమోదైన కేసులను తొలగించుకోవాలంటే.. ఆయన బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వాల్సిన పరిస్థితి. అందుకే కోవింద్ విషయంలో జగన్ అతివినయం ప్రదర్శించి కాళ్లు మొక్కడానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend