ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనే ఎందుకంటే.?

మోడీ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడును బీజేపీ తరఫున బరిలో నిలిపారు. బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా ఆయన ఎన్నిక లాంఛనమే.. అయితే ఇక్కడే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోడీల వ్యూహచతురత బయటపడింది..

నిజానికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లోక్ సభలో కావాల్సినంత బలం ఉంది. కానీ రాజ్యసభలో లేదు. అక్కడ కాంగ్రెస్ ఎంపీల సంఖ్య ఎక్కువ. అందుకే ఏ బిల్ అయినా లోక్ సభలో తొందరగా పాస్ అవుతోంది. చిక్కు వచ్చిందల్లా రాజ్యసభలోనే.. అక్కడ కాంగ్రెస్ కురువృద్ధులు, సీనియర్లు మధ్యన బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులన్నీ ఆగిపోతున్నాయి. ఎప్పుడో బీజేపీ తొలి ఏడాది తెచ్చిన జీఎస్టీ బిల్ ఇప్పటికీ కానీ అమలు అయ్యింది. అలాగే బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న ఎన్నో బిల్లులు రాజ్యసభ లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభను సమర్థంగా బీజేపీకి అనుగుణంగా నడిపించే నాయకుడి కోసం బీజేపీ శోధించింది. అందులో మొదట వచ్చిన పేరు వెంకయ్య నాయుడే..

పార్టీ అంటే ఆయనకున్న భక్తి. బీజేపీపై అభిమానంతోపాటు ఆయనకున్న వాగ్ధాటితో ఎవ్వరినైనా ముప్పుతిప్పలు పెట్టే సామర్థ్యం కలిగి ఉండడంతో వెంకయ్యను బీజేపీ ఉపరాష్ట్రపతిగా బరిలో నిలిపించి. ఆయన గెలిచాక.. రాజ్యసభకు చైర్మన్ అవుతారు. అప్పుడు వెంకయ్య సాయంతో రాజ్యసభలోని పెండింగ్ బిల్లులన్నీంటిని క్లియర్ చేయవచ్చని బీజేపీ భావన.. ఇప్పటికే రాజ్యసభలో బలం లేక కునారిల్లుతున్న బీజేపీకి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిని చేసి తద్వారా రాజ్యసభపై కూడా పట్టు సాధించవచ్చని ఈ ప్లాన్ చేసింది.

ఇలా మోడీ, షాలు రాజ్యసభపై, కాంగ్రెస్ పై పట్టుసాధించడంతో పాటు దేశప్రయోజనాల కోసం తయారు చేస్తున్న బిల్లులను రాజ్యసభలో పాస్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా నిలబెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

To Top

Send this to a friend