చార్మిలో భయం టన్నులకొద్దీ.. ఎందుకు.?

డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ సహా అందరు సినీ సెలబ్రెటీలు విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ ఒక్క చార్మి తప్ప.. మొదటి నుంచి చార్మి డ్రగ్స్ కేసును ఎదుర్కోవడానికి వెనుకంజవేస్తూనే ఉంది. విచారణలో ఎక్కడ తన తప్పు తెలుస్తుందోనన్న భయం ఆమెను వెంటాడుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే విచారణలో తన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లు ఇవ్వనని.. ఆడ పోలీసులతో విచారించాలని సహా పలు కారణాలతో హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు తెలంగాణ పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించింది. తెలంగాణ పోలీసులు అక్రమంగా డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని చూస్తున్నారని పలు ఆరోపణలు చేస్తూ హైకోర్టుకెక్కింది. ఈరోజు మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువడనుంది. కోర్టు ఏమని తీర్పునిస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

డ్రగ్స్ వాడుతున్నట్టు అయితే సెలబ్రెటీలు వారి నమూనాలు ఇచ్చి ఉండేవారు కాదు.. కానీ పూరి సహా అందరూ నమూనాలు ఇచ్చేశారు. ధైర్యంగా కేసును ఎదుర్కొంటున్నారు. వారు డ్రగ్స్ తీసుకోలేదనే ధైర్యం సదురు సినీ ప్రముఖుల్లో ఉంది.. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూరి సహా అందరూ తాము డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టం చేశారు. కానీ ఒక్క చార్మి మాత్రం విచారణను ఎదుర్కోవడానికి నమూనాలు ఇవ్వడానికి వెనుకంజ వేయడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

కాగా చార్మి హైకోర్టుకు వెళ్లడం.. పోలీసులను విమర్శించడంపై ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ స్పందించారు. తాము చట్ట ప్రకారమే వెళ్తున్నామని విచారణను వీడియో తీసి కోర్టులో ప్రవేశపెడతామని.. సెలబ్రెటీలు అంగీకారంతోనే వారి రక్త, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీస్తున్నామని స్పష్టం చేశారు. నమూనాలు ఇవ్వని వారిని బలవంతం చేయబోమని.. ఇవ్వలేరని రిపోర్టులో పొందుపరిచి కోర్టుకు సమర్పిస్తానని అకున్ స్పష్టం చేశారు. విచారణలో మహిళా పోలీసులను కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend