అంటుపెట్టిందెవరు.? సెగ కాగేదెవరు.?

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు కళ్లకు ప్రస్తుతం ప్రధాని మోడీ యుగపురుషుడిగా.. దేశాన్ని ఉద్దరించేందుకు అవతరించిన దేవుడిగా కనిపిస్తున్నాడు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఇతరులు ఎన్ని మంచి పనులు చేసినా ఆయనకు కుట్ర కోణమే కనిపిస్తోంది..

వారం రోజులుగా మధ్యప్రదేశ్ సహా మహారాష్ట్ర, పలు రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కారు. రుణమాఫీ కోసం.. గిట్టు బాటు ధర కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఇటీవలే మధ్యప్రదేశ్ లో పలువురు రైతులు అసువులు బాసారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలోని, రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికలన్నీ మోడీ రగల్చిన రుణమాఫీ, రైతులను చంపిన తీరు.. రైతుల పోరాటంపై కథనాలు పతాక శీర్షికన ప్రచురిస్తున్నాయి.

కానీ ఈనాడుకు, ఆ పత్రికాధిపతి రామోజీరావుకు ఇవేవీ కనిపించడం లేదు. అందుకే ఈనాడులో ఎంత మంది రైతులు చనిపోయినా.. రైతులు 5 రాష్ట్రాల్లో రుణమాఫీ కోసం కొట్లాడుతున్నా పట్టడం లేదు. ఒక్క వార్త కూడా ప్రచురించడం లేదు..

నిన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ లో కాల్పుల్లో చనిపోయిన రైతులను పరామర్షించేందుకు వెళ్లారు. ఆయన్ను అక్కడి బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి పరామర్షించకుండా చేసింది. అయితే సదుద్దేశంలో రాహుల్ పరామర్శకు వెళితే ఈనాడు ఈరోజు రెండో పేజీలో వేసిన కార్టూన్ ఆయనకు మోడీపై ఎంతో ప్రేమ ఉందో.. కాంగ్రెస్ పై ఎంత కోపం ఉందో అర్థమైంది. మధ్యప్రదేశ్ లో రగిలిన రైతుల కాష్టంపై రాహుల్ చలికాచుకుంటున్నట్టు ఉన్న కార్టూన్ విమర్శలు తావిచ్చింది.

యూపీలో గెలవడం కోసం రుణమాఫీ ప్రకటన చేసిన మోడీ ఇప్పుడు రామోజీకి దేవుడయ్యారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని రోడ్డెక్కిన రైతులు రామోజీకి కనిపించడం లేదు. పరామర్శకు వెళ్లిన వారిని రాజకీయాలు చేసే వారిగా రామోజీకి కనిపిస్తున్నారు. ఇంతకంటే చెత్త జర్నలిజం.. స్వామిభక్తి బీజేపీకి వంతపాడడడం మరోకటి లేదని సీనియర్ జర్నలిస్టులు మండిపడుతున్నారు.

To Top

Send this to a friend