ప్రభాస్ పక్కన ఎవరీవడ..?

రన్ రాజా రన్ లాంటి చిన్న చిత్రాన్ని తీసిన సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. ఆయన సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సంస్థ ‘సాహో’ను తీస్తోంది. ఇప్పటికే ముంబై, దుబాయ్, హైదరాబాద్ లో చిత్రీకరణ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం శంకర్-ఎహసాన్-లాయ్ లు సంగీతం అందిస్తున్నారు. 2018లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ ‘సాహో’. ఈ సినిమా ప్రభాస్ ను అంతర్జాతీయ స్టార్ ను చేసింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ కూడా తనకు వచ్చిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని 150 కోట్లతో భారీ చిత్రాన్నే తీస్తున్నారు. దీన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం.

ఇక సాహోలో హీరోయిన్ ఎవరనేది కొద్దిరోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మంది పేర్లను పరిశీలించినప్పటికి ఇంకా ఎవ్వరి పేరు ఫైనల్ కాలేదు.. పరిణీతా చోప్రా, ఆలియాభట్, పూజాహెగ్డె, శ్రద్ధాకపూర్ .., చివరగా అనుష్క పేర్లు హీరోయిన్ పరిశీలన కోసం వచ్చాయి. అయితే ఇందులో తాజాగా శ్రద్దాకపూర్ ను సాహోలో హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు తెలిసింది. శ్రద్ధా కపూర్ హిందీలో ఫేమస్ హీరోయిన్. ఆమెది ముంబై. వాళ్ల నాన్న శక్తి కపూర్ ఫేమస్ బాలీవుడ్ హీరో. శ్రద్ధ తొలిచిత్రం తీన్ పత్తి. ఆ తర్వాత ఆమె నటించిన ఆశికి, ఏక్ విలన్ లో ఈ ముద్దుగుమ్మ నటనకు కుర్రకారు మతులు పోయాయి. ఏబీసీడీ2, బాగి, లేటెస్ట్ గా ఓకేజాను చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్.. హిందీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అందం, అభినయం ఉన్న ఈ నటి ఇప్పుడు సాహోలో సెలెక్ట్ కావడంతో అందరిని అలరించింది.

To Top

Send this to a friend