తెలుగు హీరోల్లో ఎవరు గొప్ప నటుడు.?

తెలుగు తెరపై బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే కొంచెం తటపటాయించాల్సిందే.. ఎందుకంటే నటనా ప్రధానమైన సినిమాల్లో మన అగ్రహీరోలు చేసింది తక్కువే. పోనీ నంది అవార్డులను లెక్కలోకి తీసుకుంటే పలువురు హీరోలు నటనలో శభాష్ అనిపించుకున్నారు.

ఆపద్భాంధవుడితో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపి జాతీయ, నంది అవార్డులు గెలుచుకున్నారు. ఆ తర్వాత రుద్రవీణతో కూడా అవార్డులు పొందారు. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలతో నటన తగ్గించి మాస్ మసాలా, యాక్షన్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు చిరుకు నటన ప్రాధాన్యమున్న పాత్రలే దొరకడం లేదు. ఉయ్యాలవాడతో ఊపేస్తాడేమో చూడాలి..

ఇక చిరు తరువాత తెలుగులో బెస్ట్ యాక్టర్ గా వెంకటేశ్ ను చెప్పవచ్చు. వెంకీ పాత్రలో జీవిస్తాడు. గణేష్ సినిమాకు వెంకటేశ్ కు అవార్డు కూడా వచ్చింది. ఇంకా అనేక సినిమాల్లో వెంకీ నేచురల్ గా నటిస్తూ శభాష్ అనిపించుకున్నారు.

మరో ఇద్దరు అగ్రహీరోలు నాగార్జున, బాలయ్యలకు నటనాప్రాధాన్య చిత్రాలు తక్కువే వచ్చాయి. వారి నటవిశ్వరూపం చూసింది చాలా తక్కువ.. ఇక మన అగ్రహీరోల్లో ప్రధానంగా మహేశ్ బాబు పాత్రలకు ప్రాణం పెడతాడు.. నిజం సినిమా ఫెయిల్ అయినా కానీ అందులో నటనతో మహేశ్ శభాష్ అనిపించుకున్నాడు. మురారి సినిమా కూడా మహేశ్ లోని నటుడిని వెలికి తీసింది. ఇక పవన్ ఎప్పుడో తమ్ముడు సినిమాలో ఎమోషనల్ పాత్రలో నటించాడు తప్పితే పెద్దగా పాత్రలు ఆయనకు దక్కలేదు.

సమకాలీన తెలుగు అగ్రహీరోల్లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎన్టీఆరే.. ఎన్టీఆర్ నటన చూసి ఎంతో దిగ్గజ దర్శకులే మెచ్చుకున్నారు. రాజమౌళి, కృష్ణవంశీలు తీసిని సింహాద్రి, రాఖీ సినిమాలు ఎన్టీఆర్ నటన పఠిమను ప్రేక్షకులకు చూపించాయి. టెంపర్ సినిమాలో కూడా నటనతో ఎన్టీఆర్ 100 కి 150 మార్కులు పొందారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ లా నటించే మరో హీరో లేడంటే అతిశయోక్తి కాదు. ఇక ఆ తర్వాత నటనలో నాని, రానా, ప్రభాస్ కూడా ఫర్వాలేదనిపిస్తారు.

How is the Best Actor InTollywood?

To Top

Send this to a friend