నంద్యాలలో ఓటింగ్.. విజేతలెవరు.?

ఏపీ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటింగ్ మొదలైంది. బుధవారం ఉదయం 7 గంటల కు మొదలైన ఈ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం నంద్యాలలో ఉన్న 2,18వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేశారు. అధికార టీడీపీ తరఫున సీఎం చంద్రబాబు, బాలక్రిష్ణ, వేణుమాధవ్, టీడీపీ మంత్రులు ప్రచారం చేయగా.. ఇక వైసీపీ తరఫున వైసీపీ అధినేత జగన్, ఎమ్మెల్యే రోజాలు ప్రచార బాధ్యతను భుజానకెత్తుకున్నారు. టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందారెడ్డి, వైసీపీ తరఫున మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలో నిలిచారు.

ఈ ఎన్నికల్లో నంద్యాల ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. 2019 ఎన్నికలకు ప్రీ ఫైనల్ లాంటి ఈ ఎన్నికల్లో గెలిస్తేనే వచ్చే సారి అధికారం ఖాయమన్న సూచనలు కనిపిస్తుండడంతో సీఎం చంద్రబాబు, జగన్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడారు. మరి ఈరోజు నంద్యాల ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారన్నది ఓట్ల లెక్కింపులో తేలనుంది.

To Top

Send this to a friend