టీఆర్ఎస్ యాంటీమెన్ ఎక్కడ.?

 

 

ఖగోళ సైంటిస్ట్ లను చూశాం.. భౌతిక, రసాయన, అణు, జీవ, సాంకేతిక సైంటిస్ట్ లను చూశాం.. కానీ ఇదెక్కడిది కొత్తది.. ఆయన పెట్టుకున్నాడా.. లేక పత్రికలు వాళ్లు పెట్టారో తెలియదు కానీ తెలుగులో ఒక కొత్త అధ్యాయంగా ‘సామాజిక శాస్త్రవేత్త’ బిరుదు తగిలించుకున్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య.. ఈయన వాగ్ధాటి ఈ మధ్య మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది.. పక్కా దళిత వాది.. మైక్ దొరికితే ఎదుటివారిని చడమడా తిట్టేస్తాడు.. నిలదీస్తాడు.. అరిచి గోలపెడతారు..

ఆంధ్రజ్యోతి దినపత్రికలో కాలంలు రాసే కంచె ఐలయ్య రాతలు, వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే.. కేసీఆర్ గవర్నర్ కాళ్లు మొక్కితే ‘అహా.. గవర్నర్ దళితుడైతే కేసీఆర్ మొక్కేవాడా?’ అని ప్రశ్నిస్తాడు.. ఇక ఏపీలో చంద్రబాబు పుష్కరస్నానం చేయకపోతే 30 మంది బతికి ఉండేవారని నిలదీస్తాడు..

చాలా రోజుల క్రితం టైమ్స్ నౌ జాతీయ చానల్ ఎడిటర్ అద్నన్ గోస్వామి ఏపీ పుష్కరాల్లో 30 మంది చనిపోవడానికి కారణం ఎవరు అని డిబేట్ పెడితే.. కంచె ఐలయ్య మైక్ వదలలేదంటే నమ్మండి.. చంద్రబాబే అనడానికి తన వద్ద 100 కారణాలున్నాయని వాదించారు. చివరకు గోస్వామి మైక్ కట్ చేయాల్సిన పరిస్థితిలో బీభత్సంగా మాట్లాడేశారు.. అంతటి వాగ్ధాటి ఉన్నా ఎందుకో ఆయన మాటలు రాజకీయ నాయకుల వీపుకు గుచ్చుకుంటాయి.. అందుకే ఆయనను కాంట్రవర్సీ మ్యాన్ ను చేశాయి..

తెలుగులోనూ అంతే ఏ చానల్ డిబేట్ పెట్టినా.. ఈయనో అరగంట సమయం ఇవ్వాల్సిందే.. అంతలా ఏకిపారేస్తారు ప్రొఫెసర్.. వాదప్రతివాదనలు ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలు వేసే ఐలయ్య సారూ.. రాజకీయ నేతల వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోస్తాడు..

అయితే చాలారోజులుగా ఐలయ్య ఇటు టీవీ చానల్స్ లో.. అటు న్యూస్ పేపర్లలో కాలంలు రాయడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచే ఐలయ్య నేరెళ్ల ఘటన సహా టీఆర్ఎస్ చేస్తున్న కొన్ని వివాదాస్పద పనులపై ఎక్కడా ప్రస్తావించడం లేదు.. పత్రికల్లో రాయడం లేదు. ఈయనకు ఏమైందో అర్థం కావడం లేదు. ఆయనే సైలెంట్ అయ్యారా.? లేక టీఆర్ఎస్ వాళ్లే మూసేసారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట..

To Top

Send this to a friend