ఆర్ధిక మాంద్యం పరిష్కరించే దమ్ము మోడీ ప్రభుత్వానికి ఉందా ?

గత కొంతకాలంగా భారత ఆర్ధిక వ్యవస్థ మందగమనం లో ఉంది.భారత్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఆర్థికాభివృద్ధి వేగంగా పురోగతి సాధించట్లేదు.జీ .యెస్ .టీ,పెద్ద నోట్ల రద్దు, ఆర్ధిక సంస్కరణలు, వడ్డీ రేట్లు తగ్గింపు వంటివి పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని పెంచలేకపోతున్నాయి. దానికి
కారణాలు పరిశీలిస్తే …….

1 )పెద్ద నోట్ల రద్దు తరువాత నల్ల ధనం అరికట్టడానికి 20 వేల రూపాయల విలువ దాటితే కరెన్సీ చెల్లింపు చేయరాదని ఆంక్షలు విధించడం,

2) ఇన్ కం టాక్స్ కు , జీ యెస్ టీ కి భయపడి ప్రజలు కరెన్సీ లో అనధికార చెల్లింపులు చేయడం ,

3) రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ ప్రవాహం తగ్గడం తో ఆ రంగం లో తిరోగమనం ,రియల్ ఎస్టేట్ ఆస్తులు హామీ గా పెట్టుకొని రుణాలు ఇచ్చిన బ్యాంకు లు దివాళా ,

4 ) రియల్ ఎస్టేట్,బంగారం లో పెట్టుబడులు తప్ప వేరే పెట్టుబడి మార్గాలు సగటు భారతీయులకు అవగాహన లేకపోవడం,

5) గత 5 సంవత్సరాలలో రుతుపవనాలు సకాలంలో రాక వ్యవసాయ రంగం గిట్టుబాటు కాకపోవడం కారణాలు గా కనిపిస్తున్నాయి.

2016 లో భారత ప్రభుత్వం
లాగే ఇండోనేషియా కూడా బ్లాక్ మనీ ని తిరిగి ఆర్ధిక వ్యవస్థ లోకి తీసుకొని రావడానికి స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం ప్రవేశపెట్టింది.భారత్ స్వచ్ఛంద వెల్లడి పై సుమారు 50% పన్ను విధించగా,ఇండోనేషియా 3% నుండి 9% మాత్రమే పన్ను విధించింది మరియూ ఈ ఆదాయం పై ఎటువంటి న్యాయ చర్యలు ఉండవని ప్రకటించింది. భారత్ స్వచ్చంద ఆదాయ వెల్లడి పథకం ద్వారా కేవలం 10 బిలియన్ డాలర్ల బ్లాక్ మనీ వెల్లడి కాగా, ఇండోనేషియా లో సుమారు 400 బిలియన్ డాలర్లు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ లోకి తిరిగి వచ్చాయి.పలు విదేశాల్లో ధనము దాచుకున్న ఇండోనేషియా దేశస్థులు ఆ ధనం తమ దేశానికి మళ్లించారు.ఆ విధముగా వచ్చిన ధనం ను 3 సంవత్సరాలపాటు మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టేలాగా షరతు విధించారు.

ఆ చర్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్ట పరిచింది.
భారత దేశం ఇటువంటి దమ్మున్న చర్య తీసుకోగలదా ?
ప్రతి చర్యలో రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించే భారత్ లో స్విస్ బ్యాంకు లో ధనం తీసుకొని రావడానికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందో తెలియదు.ప్రభుత్వం విదేశాల్లో డబ్బు తీసుకొని వచ్చే లోగా ఆ డబ్బు ఇతర ఖాతాల్లోకి మళ్ళిపోయే అవకాశం ఉంది.
ఇండోనేషియా లాగా ఒక్క సారి అవకాశం ఇచ్చి విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి భారత మౌలిక రంగాల్లో పెట్టుబడి పెట్టేలాగా చేస్తేనే 5 ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ అనే నరేంద్రమోదీ కల నెరవేరుతుంది.

ఆ దమ్ము నరేంద్రమోదీ కి ఉందా ?????????

విశ్లేషణ:
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend