‘రంగస్థలం’ చిరుకు ఎందుకు నచ్చలేదు?


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా టైటిల్‌ చిరంజీవికి నచ్చలేదు అనే టాక్‌ వినిపిస్తుంది. చిత్రం షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్ని రోజులకే నాలుగు టైటిల్స్‌ను చిరంజీవి ముందు ఉంచడం జరిగిందట. ఆ నాలుగు టైటిల్స్‌లో ఈ టైటిల్‌పై చిరంజీవి వ్యతిరేకంగా స్పందించాడు. ఈ టైటిల్‌ మరీ ఓల్డ్‌గా ఉంది, ప్రస్తుత జనరేషన్‌ ప్రేక్షకులకు ఎక్కదు అని, కొందరికి రంగస్థలం అంటేనే తెలియదు అంటూ చిరంజీవి పెదవి విరిచాడట.

చివరకు సుకుమార్‌ చాలా ఆలోచించి, కథకు సరిగా సరిపోయేది అని ‘రంగస్థలం 1985’ టైటిల్‌ను నిర్ణయించడం జరిగింది. టైటిల్‌ ప్రకటించిన సమయంలో చిరంజీవికి మరోసారి సుకుమార్‌ కథను క్షుణంగా వివరించి, ఈ టైటిల్‌ తాను ఎందుకు అనుకుంటున్నాను అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడం వల్ల చిరంజీవి కూడా ఒప్పుకున్నాడు. దర్శకుడు సుకుమార్‌పై ఉన్న నమ్మకంతోనే చిరంజీవి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

గతంలో సుకుమార్‌ తెరకెక్కించిన పలు చిత్రాల టైటిల్‌ సినిమాలకు ప్రధాన ఆకర్షిణగా నిలిచాయి. అలాగే ఈ సినిమాకు కూడా టైటిల్‌ తప్పకుండా ఆకట్టుకుంటుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. చిరంజీవి కూడా సుకుమార్‌ను నమ్మి సరే అన్నాడు. ఇప్పటికే సినిమాపై టైటిల్‌ కారణం అంచనాలు పెరిగి పోయాయి.

To Top

Send this to a friend