వాట్పాప్ కొత్త ఫీచర్.. సూపర్


మొన్నీ మధ్యనే వాట్సాప్ లో ఓ ప్రజాప్రతినిధి వేరే వాళ్లకు పంపాల్సిన బూతు వీడియోలను ప్రజాప్రతినిధుల గ్రూపులో పొరపాటున పంపించాడు. దీంతో ఆ గ్రూపులోని మహిళా ప్రజాప్రతినిధులందరూ అతడిపై కేసు పెట్టి కటకటాలకు పంపారు. బూతు వీడియో లు చూసిన సదురు ప్రజాప్రతినిధి పరువు పోయింది. ఇక నుంచి అలాంటి వాటికి చెక్ పడనుంది..

వాట్సాప్ సరికొత్త ఫీచర్ తో అందుబాటులో వస్తోంది.. ఇకపై పొరపాటున, తొందరపడి వేరే వాళ్లకు పంపిన వాట్సాప్ మెసేజ్ లను, వీడియోలను ఉపసంహరించుకునే డిలేట్ చేసే ‘రీకాల్ ’ ఆప్షన్ ను వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు వాట్సాప్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ రీకాల్ ఆప్షన్ లో తాము పంపిన వాట్సాప్ మెసేజ్ లను ఉపసంహరించుకోవచ్చు. డిలేట్ చేసుకోవచ్చు. మెసేజ్ లను సరిదిద్దుకునేందుకు , వేరే నంబర్ కు మెసేజ్ పంపించి ఉపసంహరించుకోవాలన్నప్పుడు ఈ రీకాల్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గూగుల్ సంస్థ కూడా తమ ఈమెయిళ్లలో ఈ ఉపసంహరణల ఆప్షన్ ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వాట్సాప్ లలో పొరపాటున ఇతరులకు వెళ్లిన మెసేజ్ లను డిలేట్ చేసే అవకాశం పంపిన వారికి దక్కడం గొప్ప ఊరటగా చెప్పవచ్చు.

To Top

Send this to a friend