జాతిపిత ఒంటరి.. కేసీఆర్ కి ఏమైంది..

తెలంగాణ జాతిపిత ఆయన.. తెలంగాణ కోసమే బతికాడు.. తెలంగాణ కోసమే చనిపోయాడు. తెలంగాణమే శ్వాసగా.. ఆశగా జీవించాడు. అంతటి మహానుభావుడు చనిపోయినప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్వయంగా పాడెమోశారు. కానీ ఇప్పుడు సీఎం అయ్యాక కేవలం ప్రకటనలకే పరిమితమైపోయాడు. ఏమై పోయింది ఆ ప్రేమ.. ఆ అనుబంధం..

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా.. తెలంగాణ భావజాలాన్ని ఇనుమడింప చేసిన మహానేత.. ఆయన తెలంగాణ కోసం కేసీఆర్ తో పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ వాదిగా మారాడు. దీంతో ప్రొఫెసర్ ను ఇప్పుడు కేవలం టీఆర్ఎస్ కే పరిమితం చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు ఎవరూ పట్టించుకోలేదు. ఆయన జయంతి నాడు ఏ ఒక్క నివాళి కానీ, కార్యక్రమాలు కానీ చేయలేకపోయారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రొఫెసర్ జయశంకర్ ను వదిలేశాడు. జాతిపితకు కేవలం ఓ ప్రకటన విడుదల చేసి నివాళులని మమ అనిపించారు. అధికారికంగా జయంతిని అధికారులతో నిర్వహించినా కేసీఆర్ మాత్రం ఎక్కడా చొరవగా పాల్గొనలేదు. జయశంకర్ చనిపోయి ఇన్నేళ్ల తర్వాత ఇక కేసీఆర్ కూడా పట్టించుకోవడం లేదు. సో జాతిపిత జయశంకర్ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి అయ్యాడు. కేసీఆర్ ఆయన్ను కేవలం ఉత్సవ విగ్రహంలా మాత్రమే చూస్తున్నారు. తెలంగాణ కోసం జీవితాన్ని అర్పించిన మహాత్ముడికి పట్టిన ఓ దౌర్భాగ్యం ఇదీ…

To Top

Send this to a friend