చంద్రబాబు ఎత్తుగడ.. జగన్ అంగీకరిస్తారా.?

 

నంద్యాల ఉప ఎన్నిక చిక్కుముడి వీడిపోయింది.. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ సీటులో నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో సమీక్షించిన చంద్రబాబు ఈ మేరకు తీవ్ర పోటీ ఉన్న నంద్యాల సీటును సెంటిమెంటును దృష్టిలో ఉంచుకొని భూమా ఫ్యామిలీకే సీటు కేటాయించారు.

భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ సీటులో మొదట తనకే సీటు ఇవ్వాలని నంద్యాల టీడీపీ ఇన్ చార్జి శిల్పా మోహన్ రెడ్డి కోరారు. కానీ చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆయన జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక భూమా స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డికి సైతం చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. బేధాభిప్రాయాలు పక్కనపెట్టి అందరూ కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు.

భూమా కుటుంబానికే టికెట్ ఇచ్చి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన శోభ నాగిరెడ్డి చనిపోతే వైసీపీ అధ్యక్షుడు జగన్ పోటీ పెట్టలేదు. ఇప్పుడు నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన సీటులో పోటీ చేయనీయకుండా జగన్ కలిసి ఒప్పించాలని చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలకు సూచించారు. ఇలా సెంటిమెంటును ముందుపెట్టి వైసీపీ సీటును టీడీపీ పొందాలని ప్లాన్ చేసింది. మరి జగన్ పోటీనుంచి తప్పుకుంటారా? టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి సపోర్ట్ చేస్తాడా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend