ఈ రెంటితో ఆగదు..

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ‘వీఐపీ’ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. సూపర్‌ హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ రావడం సర్వ సాధారణం. అలాగే ఈ సినిమాకు కూడా ధనుష్‌ సీక్వెల్‌ను తీసుకు వస్తున్నాడు. ‘వీఐపీ 2’ అంటూ ప్రస్తుతం తమిళం మరియు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ధనుష్‌ సిద్దం అయ్యాడు. తెలుగులో ‘వీఐపీ’ రఘువరన్‌ బీటెక్‌గా విడుదల అయ్యింది. అయితే రెండవ పార్ట్‌ మాత్రం ‘వీఐపీ 2’గానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తెలుగు మరియు తమిళంలో భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో భాగంగా ధనుష్‌ మాట్లాడుతూ వీఐపీ సీక్వెల్స్‌ సందడి ఆగవు అని చెప్పాడు. ‘వీఐపీ’ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నన్ని రోజులు కూడా సీక్వెల్స్‌ తీస్తాను అని రెండవ పార్ట్‌ సక్సెస్‌ అయితే మూడవ పార్ట్‌ను చేస్తాను, మూడవ పార్ట్‌ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. రెండు పార్ట్‌తో ఈ సినిమాను ఆపేయాలని తాను భావించడం లేదని ధనుష్‌ పేర్కొన్నాడు.

తమిళంలో ‘సింగం’కు సీక్వెల్స్‌ వస్తున్న విషయం తెల్సిందే. అలాగే ఈ సినిమాను కూడా కొనసాగించాలని ధనుష్‌ భావిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్‌ తెలుగు మరియు తమిళంతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను ప్రమోట్‌ చేసే పనిలో ఉన్నాడు. ‘వీఐపీ’ మొదటి పార్ట్‌ తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి ఉంది. తప్పకుండా మంచి కలెక్షన్స్‌ను రాబడుతుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులున్నారు.

To Top

Send this to a friend