విజయశాంతి, శశికళ.. ఓ రహస్య భేటి!


 
విజయశాంతి.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు ఉద్యమసేనాని కేసీఆర్ తో కలిసి టీఆర్ఎస్ లో పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక ఈ రాములమ్మ రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం చైన్నైలో కుటుంబంతో సైలెంగ్ గా గడుపుతున్న రాములమ్మ తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ, పబ్బానికి రావడం లేదు. మొన్న దాసరి నారాయణరావు చనిపోతే మాత్రం గురువుగారికి నివాళులర్పించడానికి వచ్చారు.
 
 విజయశాంతి నిన్న రాత్రి 7 గంటలకు జైలు నిబంధనలన్నింటిని పక్కనెట్టి బెంగళూరులో జైళ్లో ఉన్న శశికళతో భేటి కావడం సంచలనంగా మారింది. అంతకుముందే శశికళతో  ఇటీవలే బెయిల్ పై విడుదలైన  దినకరన్  భేటి అయ్యారు. ఆయన వెళ్లారో లేదో ఇలా విజయశాంతి భేటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జైల్ల 6 గంటల తర్వాత భేటిలు నిషేధం.. అయినా అధికారులు విజయశాంతి-శశికళ బేటికి అనుమతివ్వడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
విజయశాంతి-శశికళ భేటిని కాంగ్రెస్ అధిష్టానం చేయించినట్టు సమాచారం. పెద్ద నాయకులు వెళితే అనుమానం వస్తుందని ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్న విజయశాంతిని శశికళ దగ్గరకు పంపినట్టు తెలుస్తోంది. శశి-విజయశాంతి భేటిలో ప్రధానంగా కాంగ్రెస్ కు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరినట్టు సమాచారం. దానికి అనుగుణంగా వచ్చే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-వశికళ అన్నాడీఎంకే కలిసి పోటీచేద్దామని ప్రతిపాదించినట్టు సమాచారం. భవిష్యత్తులో కాంగ్రెస్ తో కలిసి నడిచేలా శశిని ఒప్పించడానికే విజయశాంతి భేటి అయినట్టు సమాచారం.

To Top

Send this to a friend