టాలీవుడ్ కిస్సింగ్ హీరో అడ్డంగా దొరికాడు..

అర్జున్ రెడ్డి సినిమా.. ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంటూ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు కేవ‌లం రెండు లిప్ లాక్స్ సీన్లే వున్నాయని సెన్సార్ చెప్పినప్పిటికీ.. విడుద‌ల త‌ర్వాత ఇన్నిముద్దు సీన్ల‌ని చూసి సినీ ప్రేక్ష‌కులు ఖంగు తిన్నారు. ఇమ్రాన్ హ‌ష్మీని విజయ్ దేవరకొండ మించిపోతాడా అని సినీజనం అంటున్నారు. కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగులు కూడా ఈ చిత్రంలో వున్నాయట. ఏది ఏమైనప్పటికీ.. విజయ్ దేవరకొండ కేవలం లిప్ లాక్ సీన్స్‌తోనే కాదు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తోను అదరగొట్టి.. క్లాస్, మాస్ హృదయాలను దోచుకున్నాడు. టాలీవుడ్ ముద్దుల హీరోగా బిరుదు తెచ్చుకున్నాడు.

బాలీవుడ్ కిస్సింగ్ హీరోగా పేరుతెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ తెలుసుగా.. పలు రోమాంటిక్ హిందీ చిత్రాల్లో హీరోయిన్లకు ముద్దులు పెడుతూ ముద్దుల హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా ఓ హీరోకు ఆ పేరు వచ్చింది..
విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కిస్సులు ఉన్నాయి. దీంతో బాలీవుడ్ కిస్సింగుల వీరుడు ఇమ్రాన్ హష్మీ వారసుడిగా అర్జున్ రెడ్డి మారిపోయాడని సినీ జనం అంటున్నారు.

To Top

Send this to a friend