టాటూలు, పొట్టిడ్రెస్సులతో రోజా..

ఇటీవల మంత్రి అఖిల ప్రియపై రోజా చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి వేణుమాధవ్ సెటైర్లు వేశాడు. అఖిలప్రియ తన అన్న కూతురు అని, ఆమెపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రోజాను హెచ్చరించాడు. అంతేకాదు.. రోజాపై వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు సైతం చేశాడు.. ఇప్పుడు ఇవి వైరల్ గా మారాయి.

నంద్యాల ఉప ఎన్నికల వేడి రాజుకుంది. వైసీపీ తరఫున టాప్ హీరోయిన్ ఎమ్మెల్యే అయిన రోజా రంగంలోకి దిగితే టీడీపీ తరఫున హీరో బాలక్రిష్ణ, కమెడియన్ వేణుమాధవ్ ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక టీడీపీ తరఫున హీరో బాలక్రిష్ణ తనదైన శైలిలో రాజకీయ డైలాగులు వదలుతుంటే.. వేణుమాధవ్ మాత్రం కామెడీ టైమింగ్ తో కూడిన సెటైర్లు వేస్తూ బాగా ఆకట్టుకుంటున్నాడు.

ఈ సందర్భంగా రోజాపై వేణుమాధవ్ చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. రోజా అంటే ‘రో యహాసే జా’ అని దానర్ధం ఏడ్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్లు అని తెలిపాడు. టాటూలు వేసుకొని, చిన్న చిన్న డ్రస్సులు వేసుకొని డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని.. అలాంటి అసభ్యకర మాటలు తాను మాట్లాడనని వేణుమాధవ్ విమర్శించారు. నంద్యాలలో అక్కా బావా అంటూ వేణుమాధవ్ చేసిన ప్రసంగానికి విపరీతమైన కేకలు, కేరింతలు చప్పట్లు వచ్చాయి. రోజాపై వేణుమాధవ్ వేసిన సెటైర్లకు అందరూ నవ్వుకున్నారు.

To Top

Send this to a friend