డ్రగ్స్, తెలుగు ఇండస్ట్రీ, మధ్యలో వీళ్లు..

హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. నైజీరియన్స్ ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నారని పోలీసులు తేల్చారు.   దేశంలోని ఎక్కడికి డ్రగ్స్ వెళ్లాలన్నా హైదరాబాద్ నుంచే సరఫరా అవుతోందట.. పోలీసులు ఈ డ్రగ్స్ మూలాలపై శోధన మొదలుపెట్టారు. ఇందులో తెలుగు ఇండస్ట్రీలోని నటులు డ్రగ్స్ వాడుతున్నట్టు తేటతెల్లమైంది. డ్రగ్స్ వాడే ఇటీవల రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ఇండస్ట్రీకి, డ్రగ్స్ కు అవినాభావ సంబంధంపై తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇవ్వాళ స్పందించారు.

 

హైదరాబాద్ లోని ఫిలింభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, నటుడు నరేశ్, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేష్ బాబులు మాట్లాడారు. తెలుగు సినిమాల్లో నటించే కొంతమంది డ్రగ్స్ వాడకమే నిజమేనని.. కానీ వారందరినీ బాగు చేయాల్సిన అవసరం ఉందని వారు వ్యాఖ్యానించారు. డ్రగ్స్ వాడితే జీవితం నాశనమవడంతో పాటు ప్రాణాలే పోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా సినిమా నటులు డ్రగ్స్ వాడకుండా అవగాహనతో పాటు , పలు చర్యలు తీసుకుంటామని వారు వ్యాఖ్యానించారు.

 

పోలీసులు అనుమానిస్తున్న నటుల జాబితాను పరిశీలించి వారందరితో డ్రగ్స్ మాన్పించేందుకు వారి కుటుంబాలతో మాట్లాడుతామని సినీ ప్రముఖులు వెల్లడించారు. హైదరాబాద్ లో రేవ్ పార్టీల పేరుతో విచ్చలవడి డ్రగ్స్ వాడకం పెరిగిపోతోందని.. అందులో సినిమా నటులు కూడా పోయి అలవాటు పడుతున్నారని.. వారి కుటుంబాలు ఈ విషయంలో శ్రద్ధ వహించాలని వారు కోరారు. మొత్తంగా డ్రగ్స్ తో తెలుగు ఇండస్ట్రీకి సంబంధాలు బయటపడడం.. సినీ ప్రముఖులు మీడియా ముందుకొచ్చి ఖండించడం ఈరోజు సంచలనంగా మారింది.

To Top

Send this to a friend