ట్యాంపరింగ్ చేసి గెలిచారు


ఉత్తరప్రదేశ్ లో అంతలా బీజేపీ గెలవడానికి కారణమేంటి.. క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఏదైనా మోసం చేసిందా.? ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు నిజమేనా..? చూస్తే ఇందులో ఏదో మాయ ఉన్నట్టు కనిపిస్తోంది..

ఢిల్లీ అసెంబ్లీ వేదిక ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఓ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసి గెలిచిందని.. ఓ ఈవీఎం యంత్రాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ మీడియా సాక్షిగా ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చో నిరూపించారు. మూడు ఓట్లకు బదులు ఒక పార్టీకి 11 ఓట్లు ఎలా వచ్చాయో క్లియర్ గా చేసి చూపించారు. కోడ్ తో బీజేపీకి అనుకూల ఓటింగ్ ఎలా సాధ్యమో చూపించారు. ఇలా ట్యాంపరింగ్ చేయడానికి 90 సెకన్లు చాలు అని స్పష్టం చేశారు.

కాగా ఈ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. తమ ఈవీఎంల చిప్ కానీ, హ్యాక్ చేయడం సాధ్యం కాదని.. ట్యాంపరింగ్ కు అవకాశం లేదని ఆప్ ను తప్పుపట్టింది.కాగా దీనిపై బీజేపీ మండిపడింది. ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సొంత పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని.. దీనిని దృష్టి మరలించేందుకే ఈ మాయానాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

ఆప్ చెబుతున్న ప్రపంచ పెద్దన్న, టెక్నాలజీ దిగ్గజం అమెరికానే ఈవీఎంలను వాడకుండా బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహిస్తోంది. అంత పారదర్శకమైన పద్ధతి ఇండియాలో వాడడం లేదు. సందేహాత్మక ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు అసలు పార్టీలు విజయం సాధిస్తాయని ఆప్ పేర్కొంటోంది. మోడీజీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని కేజ్రీవాల్ విమర్శించారు. గుజరాత్ లో బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని అప్పుడు బీజేపీని ఆప్ ఓడిస్తుందని సవాల్ విసిరారు. మరి దీనిపై బీజేపీ కౌంటర్ ఇస్తుందా లేదో చూడాలి.

To Top

Send this to a friend