యూపీ సీఎం ఆదిత్యానాథ్ దీక్ష


మార్చి 28.. చైత్ర నవరాత్రి ప్రారంభం కాబోతోంది. ఈ దీక్షను యూపీ సీఎం ఆదిత్యనాథ్ చేపడుతున్నారు. దీక్ష సమయంలో ఆదిత్యానాత్ కఠిన నియమాలను పాటిస్తారట.. మోడీ నవరాత్రుల సమయంలో ఎలాగైతే మంచినీళ్లు, పండ్లు మాత్రమే తీసుకుంటారో అలాగే ఆదిత్య దీక్షను పట్టుదలతో చేస్తారని తెలిసింది. దీక్ష సమయంలో కేవలం బంగాళదుంపలు.. పండ్లను మాత్రమే తీసుకొని ఉపవాసం చేస్తారట..

యోగి ఆదిత్యానాథ్ ఈ దీక్షను 43 ఏళ్లుగా నిర్వహిస్తున్నారట.. దీక్షా సమయంలో ఎంతో భక్తితో విశేష పూజల్లో పాల్గొంటారని తెలిసింది. సంస్కృతి విద్యాలయ విద్యార్థులు ఈ పూజను నిర్వహిస్తారని.. మంగళవారమే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య ఈ దీక్ష కోసమే వచ్చే వారం గోరఖ్ పూర్ లోని తన మఠానికి రానున్నట్టు సమాచారం. ఇందులోనే తొమ్మిది రోజుల పాటు దీక్షను చేపడతారని సమాచారం. తన గురువు దగ్గర్నుంచి యోగి ఆదిత్య 1984లో దీక్షను చేపట్టారు.

ఆధ్యాత్మికత విషయంలో ప్రధాని మోడీ కంటే కూడా ఎక్కువే ఆదిత్యనాత్ చేస్తున్నారు. ఆయన సొంతంగా మఠాధిపతి.. యోగి కావడంతో పూజలు పునస్కారాలు సీఎం అయ్యాక కొనసాగిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా ఉండేది. కానీ సీఎం అయినా తన మూలాలు, పూజలు మరిచిపోనని ఆయన తేల్చిచెప్పారు. వచ్చేవారం తొమ్మిది రోజుల పాటు యూపీ రాజధాని లక్నో వదిలి గోరఖ్ పూర్ లో మఠంలో దీక్షను చేపడుతుండడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.

To Top

Send this to a friend