ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై టీవీ5 ప్రీపోల్‌ సర్వే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై టీవీ5 ప్రీపోల్‌ సర్వే చేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై శాస్త్రీయంగా, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఈ సర్వే జరిగింది. మొత్తం లక్ష 5 వేల శాంపిల్స్ సేకరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 50 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఈ సర్వే జరిగింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ మధ్య.. ఓటర్ల నాడిపట్టే ప్రయత్నం చేశాం. మొత్తం 13 జిల్లాల నుంచి శాంపిల్స్‌ తీసుకున్నాం. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల కలయికగా శాంపిల్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. జనరల్ సీట్లతోపాటు రాండమ్‌గా రిజర్వ్‌డ్‌ స్థానాలనూ ఎంపిక చేసుకుని సర్వే చేశాం. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్ల నుంచీ శాంపిల్స్‌ సేకరించాం. శాస్త్రీయ పద్ధతిలో పురుషులు, మహిళలు, యువకులు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాల నుంచి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో శాంపిల్స్ తీసుకున్నాం.

To Top

Send this to a friend