భారీ స‌క్సెస్ దిశ‌గా వెంక‌టాపురం


ఈ శుక్ర‌వారం(మే12) రిలీజైన చిన్న సినిమా వెంక‌టాపురం. హ్యాపీడేస్ ఫేం రాహూల్ హీరోగా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫ‌ణికుమార్ నిర్మించిన ఈ సినిమా అనూహ్య‌మైన రీతిలో స‌క్సెస్ అయ్యింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ సినిమా కు మార్నింగ్ షో త‌రువాత వ‌ర్డ్ ఆఫ్ మౌత్ సూప‌ర్ పాజిటివ్ రావ‌డంతో మ్యాట్నీ షో నుంచి డ‌బుల్ ఆక్యుపెన్సీతో మొద‌టి రోజునే మంచి వ‌సూళ్ళు సాథించింది. వెంక‌టాపురం సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ ను చూసి ట్రేడ్ వ‌ర్గాలు భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇదే జ‌రిగితే మ‌రో చిన్న సినిమా పెద్ద స‌క్సెస్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ లేకుండా రెండుగంట‌ల పాటు స‌స్పెన్స్ తో ప్రేక్ష‌కున్ని ఎంట‌ర్టైన్ చేసింది వెంక‌టాపురం. హీరో రాహూల్ లుక్. సాయి ప్ర‌కాష్ సినిమాటోగ్ర‌ఫి.. అచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎస్సెట్గా నిలిచాయి. కొత్త జోన‌ర్లో తెర‌కెక్కిన వెంక‌టాపురం ప్రేక్షకుల‌ను థ్రిల్ చేస్తూతెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో మ‌రో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయ‌డం ఖాయం.

To Top

Send this to a friend