ఉయ్యాలవాడ సినిమా కోసం టాప్ హీరోయిన్

అనుష్క.. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్.. రుద్రమదేవి, బాహుబలి, అరుంధతి లాంటి చారిత్రక నేపథ్య కథల్లో నటించి శభాష్ అనిపించుకుంది. అందుకే ఇప్పుడు ఆమె అయితేనే తన చారిత్రక చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాకు న్యాయం జరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే చిరుతో కలిసి స్టాలిన్ లో నటించిన అనుష్క.., ఇప్పుడు 151వ చిత్రం ఉయ్యాలవాడలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. గతంలో చిరంజీవి 150 వ చిత్రం ఖైదీలో హీరోయిన్ గా మొదట అనుష్కనే అనుకున్నారు. కానీ బాహుబలి చేస్తుండడంతో కాల్షీట్లు లేక అనుష్క ఆ ప్రాజెక్టును ఒప్పుకోలేదు.

మొన్న ఐశ్వర్య, నిన్న విద్యాబాలన్, నేడు అనుష్క.. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న తన 151వ చిత్రంలో హీరోయిన్ ఎవరనే దానిపై విస్తృతంగా శోధన జరిగింది. కానీ చివరకు అనుష్కకే ఆ అవకాశం దక్కినట్టు టాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీల్లో విడుదల చేయాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఫేమస్ హీరోయిన్ అయితే సినిమా మరింతగా జనంలోకి వెళ్తుందని భావించారు. అనుష్యను ఇందుకోసం ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో నటించాలని నిర్మాత, కం మీరో రాంచరణ్ అనుష్కను సంప్రదించినట్టు సమాచారం.

To Top

Send this to a friend