బిగ్ బాస్ నుంచి ఈవారం ఇద్దరు ఔట్..

రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న బిగ్ బాస్ షోలో శని, ఆదివారాలు వచ్చిందంటే సందడి నెలకొంది. ఆ రోజు ఎన్టీఆర్ వచ్చి మరింత హుషారెక్కిస్తాడు. అంతేకాదు.. శని, ఆదివారాల్లో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకరిని ఇంటి నుంచి బయటకు పంపిస్తారు. ఈ రోజు రాత్రి ఎవరు ఎలిమినేషన్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక కొద్దిసేపటి క్రితమే స్టార్ మాటీవీ బిగ్ బాస్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో ఈవారం డబుల్ ధమాకా అని ఎన్టీఆర్ ప్రకటించారు. అంటే ఈ వారం కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తామని స్పష్టం చేశారు.

రెండు వారాల క్రితం మహేశ్ కత్తి, కల్పనను కూడా ఇలానే ఎలిమినేట్ చేసిన ఎన్టీఆర్ గడిచిన వారం మాత్రం ఎలిమినేట్ అయిన ముమైత్ ను మళ్లీ హౌస్ లోకి పంపించారు. ఇక ఈ వారం ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అర్చన, కత్తి కార్తీక, శివబాలాజీ, ధన్ రాజ్ ఈ నలుగురు ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన సెలబ్రెటీలు. వీరిలోంచి ఇద్దరిని ఎలిమినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో అర్చనను అందరూ వ్యతిరేకిస్తుండడం.. ఓట్లు కూడా పడుతున్నట్టు సమాచారం. దీంతో అర్చన ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది. ఇక రెండో ఎలిమినేటర్ అయితే కత్తి కార్తీక, లేదా శివబాలాజీ ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ధన్ రాజ్ కామెడీ టైమింగ్ నేపథ్యంలో అతడు ఎలిమినేట్ కాకపోవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. సో డబుల్ ధమాకాలో ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరనేది తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు ఆగాల్సిందే..

To Top

Send this to a friend