అనుష్కకు ఈ దీపావళి స్పెషల్‌


‘బాహుబలి’ చిత్రంలో దేవసేన పాత్రలో నటించి మెప్పించి, అనూహ్యంగా క్రేజ్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుష్క ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. మొదట ఈ చిత్రాన్ని పౌరాణిక చిత్రంగా అంతా భావించారు. అయితే ఇదో సాంఫీుక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం అని తేలిపోయింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా చాలా సైలెంట్‌గా తెరకెక్కుతుంది. చిత్రీకరణ కూడా దాదాపు 85 శాతం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్‌ను పూర్తి చేసి దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క ఒక విభిన్న పాత్రలో కనిపించనున్నట్లుగా చెబుతున్నారు. ‘ప్లిజమీందార్‌’ వంటి విభిన్న తరహా చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న అశోక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రభాస్‌కు సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ల తరహాలోనే ఈ చిత్రం కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా కథ ఏంటి, అనుష్క పాత్ర ఏంటి అనే విషయంలో మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు.

To Top

Send this to a friend