బిగ్ బాస్ లో దొంగలు పడ్డారు..

తెలుగు బిగ్ బాస్ షో ప్రస్తుతం ఫుణె శివారులోని కొండ ప్రాంతంలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో తీస్తున్నారు. ఇందులోనే తెలుగు సెలబ్రెటీలు దాదాపు 36 రోజులుగా ఉంటున్నారు. ఎంతో మంది మాటీవీ నిర్వాహకులు ఇక్కడే మకాం వేసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిగ్ బాస్ ఇంట్లో దాదాపు 65కు పైగా సీసీ కెమెరాల నిఘా..తో దుర్భేద్యంగా ఉంది.

కానీ మంగళవారం అర్ధరాత్రి బిగ్ బాస్ ఇంట్లో దొంగలు పడి సర్వం దోచుకెళ్తారు. బిగ్ బాస్ పంపిన ఆహార వస్తువులు, గిన్నెలు, బోళ్లు, ఫ్రిజ్ లోని సామాను.. ఆఖరు పడుకోవడానికి ఉపయోగించే పరుపులు సహా ఇంట్లోని అన్నింటిని నల్లటి ముసుగులు ధరించిన దొంగలు పడి దోచుకుపోయారు. అడ్డువచ్చిన బిగ్ బాస్ లోని సెలబ్రెటీలను తోసేయడం.. గాయపరచడం కూడా చేశారు. ఈరోజు మాటీవీ విడుదల చేసిన ప్రొమోలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ప్రతి సోమవారం మాత్రమే బిగ్ బాస్ ఇంట్లోకి సరుకులను ఇస్తాడు. దాన్ని అంతా దొంగలు దోచేయడంతో ఇప్పుడు సెలబ్రెటీలు ఏం తింటారు.. తిండికోసం కొట్టుకుంటారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్ ప్రోమో చూశాక ఈరోజు రాత్రి దొంగల బీభత్సకాండ ఉండబోతోందని.. ఇది బిగ్ బాస్ పంపిన దొంగలా.? లేక నిజంగానే అసలు దొంగలు వచ్చి ఇళ్లు గుల్ల చేశారో రాత్రి చూడాల్సిందే..

To Top

Send this to a friend