ఆ హీరోలు.. నిజంగానే బిచ్చగాళ్లట..


హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగునాట విలన్ అయ్యాడు ఆది పినిశెట్టి. సరైనోడులో అల్లు అర్జున్ కు పోటీగా నటించి మెప్పించాడు. తమిళంలో అడపదడపా హిట్ చిత్రాల్లో నటిస్తున్న ఆది ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే స్వతహాగా ఆది పినిశెట్టి తెలుగువాడే. ఆయన తండ్రి రవిరాజా పినిశెట్టి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. చిరంజీవి, మోహన్ బాబులతో పెద్ద హిట్ చిత్రాలు తీశారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆది తనకు తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ హీరో మంచు మనోజ్ అని చెప్పాడు. మనోజ్, తాను చేసిన ఒక చిలిపి పనిని గుర్తుకు తెచ్చుకున్నాడు..

20 ఏళ్ల క్రితం మానాన్న రవిరాజా దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా సినిమా మొదలైంది. షూటింగ్ కోసం మా ఫ్యామిలీ, మోహన్ బాబు ఫ్యామిలీలు ఫ్రాన్స్ వెళ్లాం. అక్కడ పారిస్ లో ఓ చోట షూటింగ్ జరుగుతుండగా.. నేను, మోమన్ బాబు కొడుకు మంచు మనోజ్ కలిసి ఎవరికీ చెప్పకుండా ఓ బస్ ఎక్కి వేరే చోటకు వెళ్లాం. తిరిగి షూటింగ్ స్పాట్ కు రాగా అక్కడ ఎవరూ లేరు. భయమేసింది. జేబులో డబ్బులు లేకపోవడంతో పక్కనున్న నది వంతెన వద్ద పాటలు పాడుతూ బిచ్చగాళ్లుగా అడుక్కున్నాం. వచ్చిన డబ్బులతో బస్ ఎక్కి మా వాళ్లను చేరుకున్నామని ఆది చెప్పాడు. ఇలా బిచ్చగాళ్లుగా మారిన నాటి పిల్లలే నేడు స్టార్ హీరోలుగా ఎదిగారన్నమాట..

To Top

Send this to a friend