నంద్యాలలో వైసీపీ ఎందుకు ఓడిందో తెలుసా.?

ఎన్నో అనుకున్నాం.. ఏదో ఆశించాం.. కానీ వైసీపీ తలరాత మారలేదు..సంచలనం నమోదు కాలేదు. అధికార టీడీపీనే విజయం సాధించింది. వైసీపీ మరోసారి చతికిలపడింది. అధికారంలో ఉండడమే టీడీపీ గెలుపునకు కారణమా.? ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తప్పటడుగులు వేసిందా.? అసలు వైసీపీ ఓటమికి, టీడీపీ గెలుపునకు మధ్య కారణాలేంటో తెలుసుకుందాం..

ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదాలు, విమర్శలే కొంపముంచాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రధానంగా సీఎం చంద్రబాబును కాల్చిపారేయాలని నంద్యాలలో జగన్ పిలుపునివ్వడం దుమారం రేగింది. ఇక మంత్రి అఖిలప్రియ వేషధారణపై ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి డ్యామేజ్ అయ్యాయని తెలిసింది.

ఇక సెంటిమెంట్ అస్త్రం నంద్యాలలో బాగా పనిచేసిందనే టాక్ వినిపిస్తోంది. తల్లిదండ్రులు లేని భూమా బిడ్డలపై జగన్ దండయాత్ర చేశాడనే విమర్శలు ప్రజల్లో వ్యక్తం అయ్యాయి. తల్లిదండ్రులు లేరనే సానుభూతి పవనాలు ప్రజల్లో తీసుకెళ్లడంలో టీడీపీ విజయం సాధించింది. అందుకే భూమా ఫ్యామిలీకి ప్రజలు కట్టం కట్టారు. ఇలా జగన్ చేసిన తప్పిదాలు టీడీపీకి వరంగా మారగా.. అధికారంలో ఉండడం టీడీపీకి కొంత కలిసివచ్చింది.

To Top

Send this to a friend