అదేమంత పెద్ద తప్పుకాదే..!

మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో ‘ముకుంద’ చిత్రం ద్వారా పరిచయం అయ్యి, ఆ వెంటనే ‘ఒక లైలా కోసం’ చిత్రాన్ని చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తెలుగులో ఈ అమ్మడు మళ్లీ నటించదేమో అని భావిస్తున్న తరుణంలో ‘డీజే’ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లో మెరిసింది. ‘డీజే’ చిత్రంలో భారీగా గ్లామర్‌ ఒలకబోసిందని విడుదలకు ముందు నుండే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంతో ఈమెకు భారీ క్రేజ్‌ రావడం మొదలైంది. దానికి తోడు సినిమా కూడా పర్వాలేదు అంటూ టాక్‌ను దక్కించుకుంది. పూజా హెగ్డే గ్లామర్‌కు మంచి మార్కులు పడ్డాయి.

పూజా హెగ్డే ‘డీజే’ చిత్రంలో బికినీ వేయడంతో పాటు అందాల ప్రదర్శణకు ఏమాత్రం అడ్డు చెప్పక పోవడంతో ఆమెను ముందు ముందు మరింత గ్లామర్‌ పాత్రల్లో చూస్తామని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే అందాల ఆరబోత గురించి మాట్లాడుతూ బికినీ వేయడం తన దృష్టిలో పెద్ద తప్పేం కాదని, తాను అందాల ప్రదర్శణ చేయడం ఏదో పెద్ద తప్పుగా కొందరు ప్రచారం చేస్తున్నారని, ఆ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించబోతున్న సినిమాలో ఇంకా అందాల ప్రదర్శణ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడి అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే.

To Top

Send this to a friend