తీసేసిన ఫైట్ సీన్ ఇదే..

బాహుబలి 2 ఓ కళాఖండంగా ప్రేక్షకుల మదిని దోచేస్తోంది. జక్కన్న చెక్కిన ఈ శిల్పం 1000 కోట్ల వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. అంతటి మహా సినిమాలో కొన్ని సీన్లను దర్శకుడు రాజమౌళి తీసేశాడు.. అవి కూడా ఆణిముత్యాల్లాంటివే. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో వాటిని తీసేశారు. అందులో ఓ ప్రముఖ తెలుగు విలన్ నటించాడు. ఆ సీన్ ఎక్కడ వస్తుందంటే..

బాహుబలి2లో మందబుద్ది గల బాహుబలి కుంతల రాజ్యంలో ఉంటాడు. యువరాణి అనుష్క ప్రేమ పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే అనుష్క దేశం కుంతల రాజ్యంపై పిండారీలనే వారు దాడి చేస్తారు.. వారి నుంచి అనుష్కను, కుంతల రాజ్యాన్ని కాపాడేందుకు బాహుబలి తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాడు. మందబుద్దిగల వాడు అద్భుత యుద్ధవీరుడిగా కనిపించడంతో అనుష్కతోపాటు కుంతల రాజు, రాణి సహా సేనలు ఆశ్చర్యపోతాయి. ఈ సందర్భంగా పిండారీలదరినీ చంపేస్తాడు బాహుబలి. ఈ అరివీర పరాక్రమ బాహుబలి యుద్ధ సీన్లలోనే ఓ సీన్ ను రాజమౌళి కట్ చేశాడు. ఆ కట్ చేసిన సీన్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

బాహుబలి2 నుంచి తీసేసిన ఆ అద్భుత సీన్ ను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend