చంద్రబాబును నడిరోడ్డు మీద కాల్చేయాలా.?

జగన్ మాటల మంటలు రేపారు. నంద్యాల ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల లో గెలుపుతో బాబుకు షాక్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు..

నంద్యాల నుంచి బరిలో టీడీపీ ఎమ్మెల్సీ గా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి రాజీనామా చేయించి బరిలో దింపాడు. నంద్యాలలో అశేష జనవాహిని మధ్య శిల్పా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నంద్యాల ప్రజలను శిల్పాను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

జగన్ నంద్యాల సభలో మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు, కుట్రపూరిత రాజకీయాలు, అవినీతి అసమర్థ పాలనపై తప్పు ఇవ్వాలని కోరాడు. బాబును నడిరోడ్డు మీద కాల్చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ జైలు కెళ్లక తప్పదని కొందరు.. ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని కొందరు మండిపడ్డారు. సీఎంను కాల్చేస్తామంటున్న జగన్ సీఎం అయితే అరాచకమేనని కొందరు విమర్శలు గుప్పించారు. ఇలా జగన్ చేసిన విమర్శలు ఇప్పుడు టీడీపీని షేక్ చేస్తున్నాయి.

To Top

Send this to a friend