116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు..

తెలంగాణ శాసనసభలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సాయంత్రం 5 గంటలకు ఓటు వేయనున్నారు.

అయితే పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మనోహన్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ వాకబు చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున్న చికిత్సకు అంతరాయం కలిగించడం శ్రేయస్కరం కాదని సీఎం చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఓటు వేసే ప్రక్రియను విరమించుకున్నారు.

To Top

Send this to a friend