కుక్కనే బంగ్లాదేశ్.. బెబ్బులి ఇండియా ..

 

ఎప్పుడో 2007 వరల్డ్ కప్ లో ఇండియాపై గెలిచిన బంగ్లా ఎప్పుడూ తమదే గెలుపు అని విర్రవీగుతుంది. కానీ ఇప్పుడు నిన్నటి టీమిండియా ఆట చూశాక బంగ్లా అభిమానులకు సరైన బుద్ది వచ్చింది.  దేనికైనా ఓ హద్దు ఉంటుంది. అసలు బంగ్లాదేశ్ దేశంగా మారడానికి కారణం ఇండియానే. అలాంటి భారత్ పై ప్రేమ చూపాల్సిన బంగ్లాదేశ్. . అక్కడి అభిమానులు ప్రతీసారి క్రికెట్ పోటీ అనగానే ఇలానే సోషల్ మీడియాలో ఇండియాపై వ్యతిరేకంగా వికృతంగా పోస్టులు పెడుతున్నారు.

భారత్ కుక్కనట.. బంగ్లాదేశ్ బెబ్బులి అట.. వాళ్లు మనల్ని వేటాడట మట.. టీమిండియాతో బంగ్లా సెమీస్ పోరుకు ముందు సోషల్ మీడియాలో ఇలా మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారు…సెమీఫైనల్ చేరగానే బంగ్లాదేశ్ టీంకు, ఆ దేశ అభిమానులకు వెర్రి తలకెక్కి  ఇండియా జట్టును ఓడిస్తామంటూ గ్రాఫిక్స్ తో చేసిన పిచ్చి పోస్టులు పెట్టారు.   కానీ నిన్న మ్యాచ్ జరుగుతుండగానే బంగ్లా అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. ఇండియన్ టీం.. బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది… పులిలా ఇండియా విరుచుకుపడితే.. కుక్కలా బంగ్లాదేశ్ పారిపోయింది.

నిన్నటి సెమీఫైనల్ మ్యాచ్ లో బంగ్లా బౌలర్లను టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్లు రోహిత్, ధావన్ లు చెడుగుడు ఆడారు. సోషల్ మీడియాలో ఇండియాను అవమానించేలా పోస్టులు పెట్టిన బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తుగా ఓడించారు. భారత ఆటగాళ్లు బౌండరీలు బాదుతుంటే బంగ్లా అభిమానులు నిశ్చేష్టంగా చూస్తూ ఉండిపోయారు.  ఇలా బంగ్లా బెబ్బులిని టీమిండియానే కుక్కను కొట్టినట్టు కొట్టింది.

To Top

Send this to a friend