బాబు, జగన్.. పరిణితి,ఉన్మాదం..

ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్ చేసిన విమర్శలపై టీడీపీ కౌంటర్ అటాక్ మొదలైంది. టీడీపీ మంత్రులు దేవినేని, పరిటాల సునీత, సహా ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పరిటాల సునీత అయితే జగన్ ను ఉద్దేశించి బిడ్డ నిన్ను రాయలసీమలోనే లేకుండా చేస్తాం.. మేం తలుచుకుంటే ఒక్కరోజు కూడా నడిరోడ్డుపై నువ్వు తిరగలేవంటూ మండిపడింది..

ఇక జగన్ చేసిన విమర్శలపై చంద్రబాబు కూడా ఒకింత అసహనానికి గురయ్యారని సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో తాను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని.. అయితే ఆ సమయంలో ఎన్నో సార్లు ఎన్నికలు వచ్చినా.. అసెంబ్లీలోపలా, బయటా తాను ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించిన సందర్భాలు లేవని.. ఇలా జగన్ లా కాల్చేస్తానని పరుషంగా అనలేదని చంద్రబాబు మంత్రులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందుకే ఇక జగన్ ను ఉపేక్షించవద్దని రెచ్చిపోండని మంత్రులకు చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం..

అందుకే జగన్ వ్యాఖ్యలపై మంత్రులు వీర లెవల్లో తిట్ల వర్షం కురిపిస్తున్నారు. దొంగ, నిందుతుడు, కేసులున్నాయని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.. చంద్రబాబు అయితే జగన్ జైలు కెళ్లాక నేర ప్రవృత్తి పెరిగిపోయిందని.. ప్రజలు ఒక ఉన్మాదికి ఓటేస్తారా.. లేక నాలాగా పరిణితి గల వ్యక్తికి ఓటేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతం ఏపీని కుదిపిస్తోంది.

To Top

Send this to a friend