తమిళ తలైవ రజినీ రావాల్సిందే..


తమిళ రాజకీయాలు ప్రస్తుతం శూన్యంగా మారాయి. జయలలిత మరణం తర్వాత సరైన నాయకుడు లేక తమిళులు ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని నాయకులు, ప్రజలు, అభిమానులు సూచిస్తున్నా రాజకీయాల్లోకి రావడానికి రజనీ కాంత్ ససేమిరా అంటున్నారు. వివాదాల్లోకి రానని.. ప్రశాంతంగా ఉండడానికే ఇష్టపడతానని పేర్కొన్నాడు.

ఇదే సమయంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తీస్తున్న రోబో 2.0 సినిమాలో రజినీ నటిస్తూ బిజిగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు శ్రీలంకలో నిర్వాసితులైన తమిళులకు 150 గృహాలను కట్టించింది. వాటిని ప్రారంభించేందుకు రజినీని ఆహ్వానించాయి. రజినీ ఒప్పుకున్నారు. అయితే ప్రతిపక్ష డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు రజినీని ఈ విషయంలో టార్గెట్ చేసి శ్రీలంకకు వెళ్లవద్దని విమర్శించాయి. శ్రీలంకలో తమిళలును ఊచకోత కోశారని.. అలాంటి దేశంలో పర్యటిస్తే ఊరుకునేది లేదని మండిపడ్డాయి. దీంతో రజినీ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

కాగా రజినీపై వస్తున్న విమర్శలను ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తమిళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా చైన్నైలో ఏప్రిల్ 2న భారీ సమావేశం పెట్టారు. రజినీ సొంత కళ్యాణ మండపంలోని నిర్వహిస్తున్నారు. దీనికి రజినీని రప్పించాలని.. ఎలాగైనా రాజకీయ అరంగేట్రం చేయించాలని అభిమానులు పట్టుదలగా ఉన్నారు. దీంతో తమిళ మీడియా అంతా ఈ సమావేశంపై ఫోకస్ పెట్టారు. రాజకీయాలు మలుపుతిప్పే ఈ సమావేశంపై ఇప్పుడు అంతా చర్చ సాగుతోంది. రజినీ తమిళ రాజకీయాల్లోకి వస్తారా.. లేక అభిమానులకు సర్ది చెప్పి పంపిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

To Top

Send this to a friend