బొంద పెట్టిన చోట బొక్కెలేరుకోవడమే..

ఏపీని విభజించి ఎప్పుడైతే తెలంగాణను ఏర్పాటు చేశారో అప్పుడే విభాజిత ఏపీలో కాంగ్రెస్ కథ ముగిసిపోయింది. ఎంతో మంది దిగ్గజ కాంగ్రెస్ నేతలకు పార్టీలు మారడమో.. రాజకీయ సన్యాసం తీసుకోవడమో చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ వీర భక్తుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయాలనే వదిలేశారు. ఇలా ఎంతో మంది కాంగ్రెస్ ను వదిలేసినా.. వదలకుండా అనంతపురం జిల్లాకు చెందిన రఘువీరా రెడ్డి పట్టుకు వేలాడుతున్నారు.

కాంగ్రెస్ పని నిజంగానే ఏపీలో ఖతమైందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మళ్లీ పాత గాయాలు రేపి పుంజుకోవాలని చూస్తోంది. ప్రత్యేక హోదా కోసం పలు నిరసనలు, సభలను నిర్వహిస్తోంది. రాహుల్ గాంధీతో గుంటూరు ఏపీ ప్రత్యేక హోదా కోసం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి పవన్ ను ఆహ్వానిస్తే ఆయన రాలేదు. కానీ మద్దతు ప్రకటించారు.

ఎన్ని ఆందోళనలు చేసినా.. ఎంత పోరాడినా కాంగ్రెస్ ది వడిసిన చరిత్రేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో నిన్న చంద్రబాబు నవనిర్మాణ దీక్షలో ఈ మేరకు కాంగ్రెస్ ను తూర్పార పట్టారు. అడ్డగోలుగా విభజించి ఏపీకి రాజధాని కూడా లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని .. సభకు వచ్చే రాహుల్ ను నిలదీయాలని ఏపీ సీఎం పిలుపునివ్వడం విశేషం.. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎంత పోరాడుతున్నా కానీ కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమే.. కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు ఎప్పుడో బొందపెట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

To Top

Send this to a friend