ఏదో ఉంది.. వర్కౌట్‌ అయ్యేనా?


నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు, ఆదిలు హీరోలుగా రాజేంద్ర ప్రసాద్‌ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శమంతకమణి’. ఇటీవల మల్టీస్టారర్‌ చిత్రాలు రావడమే గగనం అయిన సమయంలో నలుగురు హీరోలతో మల్టీస్టారర్‌ రానుండటంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు నుండి కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా టీజర్‌ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. సినిమాలో మ్యాటర్‌ ఉంటుందని అనిపిస్తుంది.

అసలు శమంతకమణి ఏంటా అని ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. నలుగురు హీరోలతో సమాన ప్రాధాన్యం ఇస్తూ దర్శకుడు చేసిన ఈ ప్రయత్నం సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. మహేష్‌బాబు ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించడంతో సినిమా స్థాయి మరింత పెరిగింది. నారా రోహిత్‌కు మిగిలిన ముగ్గురు హీరోలతో పోల్చితే కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉండేలా టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.

రాజేంద్ర ప్రసాద్‌ కామెడీతో పాటు, నలుగు హీరోలు చూపించే హీరోయిజంతో పక్కా మాస్‌ మసాలా చిత్రంగా ఇది ఆకట్టుకోవడం ఖాయం అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత వస్తున్న నలుగురు హీరోల మల్టీస్టారర్‌ చిత్రం అవ్వడంతో ఈ సినిమాను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది.

To Top

Send this to a friend