అనుష్కతో అయ్యింది.. ఇప్పుడు తమన్నాతో!


సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి పుకార్లు షికార్లు చేయడం చాలా కామన్‌. కొన్ని విషయాలు నిజంగా విడ్డూరంగా అనిపిస్తున్నాయి. ఇక అసు విషయానికి వస్తే ప్రభాస్‌ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా అనుష్క నటించనుందని, ఇద్దరి మద్య వ్యవహారం ఉండటం వల్లే ‘సాహో’లో కూడా అనుష్కనే ప్రభాస్‌ కోరుకుంటున్నాడు అంటూ కొన్ని రోజుల ముందు తారా స్థాయిలో వచ్చాయి.

అనుష్క, ప్రభాస్‌లు పెళ్లి చేసుకోబోతున్నారు, పెళ్లి అయ్యింది అన్నట్లుగానే కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఆ వార్తలపై క్లారిటీ రాకుండానే మరో కొత్త వార్త ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో దావాణంలా సర్కులేట్‌ అవుతుంది. అదే మిల్కీ బ్యూటీ తమన్నాను ప్రభాస్‌ ట్రై చేస్తున్నాడు. ఆమెను మచ్చిక చేసుకునేందుకు ప్రభాస్‌ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా ఉంది.

తమన్నా అంటే ‘రెబల్‌’ చిత్రం టైం నుండే ప్రభాస్‌కు ఇష్టమని, అందుకే ‘బాహుబలి’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా తమన్నాను ప్రభాస్‌ కోరాడు అని, ప్రభాస్‌ కోరిక మేరకు జక్కన్న రెండవ హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేయడం జరిగింది. ఇక తాజాగా తమన్నా బాలీవుడ్‌లో ఒక చిత్రాన్ని చేస్తుంది. ఆ సినిమాలో ప్రభాస్‌ గెస్ట్‌రోల్‌లో నటించేందుకు ఓకే చెప్పాడు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం చాలా దూరం వెళ్తుందని మరోసారి మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రభాస్‌, తమన్నాల మద్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే టాక్‌ వినిపస్తుంది. ప్రభాస్‌ ఈ వార్తలపై ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

To Top

Send this to a friend