దీక్షకు అక్కడ మసాజ్ చేసిన శివబాలాజీ

బిగ్ బాస్ లో వివాదం చోటు చేసుకుంది… దీక్ష తొడలు పట్టుకున్నాడు హీరో శివబాలాజీ. ఇది ఇంటా బయట వివాదం రేగింది. వివాదం ఉంటే జనాలు చూస్తారు. ఇన్నాళ్లు లేని వివాదాన్ని నిన్న రాత్రి బిగ్ బాస్ సృష్టించాడు. షోలో కొంచెం అతి చేశాడు. దీనిపై ఇంటా బయటా విమర్శల వాన కురుస్తున్నా కూడా మాటీవీ వీక్షకులు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట..

మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ వివాదాలకు వేదికైంది. బిగ్ బాస్ మంగళవారం సెలబ్రెటీలకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక హోటల్ సెట్ ను వేసి ఇందులో నవదీప్, దీక్షలను అతిథులుగా .. మిగతా కంటెస్టెంట్లను సర్వర్ లుగా పెట్టాడు. వీళ్లందరూ దీక్ష, నవదీప్ లకు సేవలు చేయాలని ఆదేశించాడు. అంతేకాదు.. అందరీనీ తీవ్రంగా హింసించి సేవలు చేసుకోవాలని అలా అయితేనే మీ ఇద్దరినీ వచ్చేవారం ఎలిమినేషన్ నుంచి తప్పిస్తామని బిగ్ బాస్ నవదీప్, దీక్షలకు హామీ ఇస్తాడు.

దీంతో వారిద్దరు రెచ్చిపోయి మిగతా కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తూ సేవలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా దీక్ష.. శివబాలాజీని సేవలు చేయించుకునేందుకు వింత కోరిక కోరుతుంది. అందులో ఒంటిపై బట్టలు లేకుండా శివబాలాజీ తన కాళ్లు, తొడలకు మసాజ్ చేయాలని సూచిస్తుంది. దీనికి శివబాలాజీ కూడా ఒప్పుకొని బట్టలు విప్పేసి దీక్ష కాళ్లు, తొడలు మర్ధనా చేయడం మంగళవారం సంచలనమైంది. శివబాలాజీ దీక్ష చెప్పినట్టు తొడలు పట్టుకొని మసాజ్ చేయడం.. హౌస్ లో దుమారం రేపింది. కానీ వీక్షకులకు మాత్రం కనువిందు చేసింది. ఈ టాస్క్ తో బిగ్ బాస్ రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయిందట..

To Top

Send this to a friend