సైమా 2017 విన్నర్‌


తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డు వేడుక దుబాయిలో తారల తళుకు బెళుకు మద్య ప్రారంభం అయ్యింది. సౌత్‌ సినీ ప్రముఖులు దుబాయిలో సందడి చేస్తున్నారు. తెలుగు మరియు తమిళంకు చెందిన పలువురు స్టార్‌ హీరోయిన్స్‌ సైమా వేదికపై తమ హాట్‌ అందాతో డ్యాన్స్‌లు వేస్తూ ఆహుతులను అలరిస్తున్నారు. సైమా అవార్డుల్లో ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌ మరోసారి సత్తా చాటింది. ఎన్టీఆర్‌ ఉత్తమ హీరోగా ఎంపిక కాగా, ‘పెళ్లి చూపులు’ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది. నానికి జెంటిల్‌మన్‌ చిత్రంకు గాను ఉత్తమ నటుడి అవార్డు(క్రిటిక్‌) దక్కింది.

సైమా 2017 విజేతల పూర్తి జాబిత :
ఉత్త‌మ చిత్రం – పెళ్ళి చూపులు
ఉత్త‌మ న‌టుడు – ఎన్టీఆర్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ న‌టి – ర‌కుల్ ప్రీత్ సింగ్‌(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్‌) – నాని(జెంటిల్ మన్‌)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – త‌రుణ్ భాస్క‌ర్(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ తొలి చిత్ర హీరో – రోష‌న్ (నిర్మ‌ల కాన్వెంట్‌)
ఉత్త‌మ తొలి చిత్ర హీరోయిన్ – నివేద థామ‌స్ (జెంటిల్ మ‌న్‌)
ఉత్త‌మ స‌హాయ‌క పాత్ర – శ్రీకాంత్‌(స‌రైనోడు)
ఉత్త‌మ స‌హాయ న‌టి- అన‌సూయ‌(క్ష‌ణం)
ఉత్త‌మ హాస్య న‌టుడు – ప్రియ‌ద‌ర్శి(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ ప్ర‌తి నాయ‌కుడు – జ‌గ‌ప‌తిబాబు(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు – దేవిశ్రీ ప్ర‌సాద్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ సాహిత్య ర‌చ‌యిత – ప్ర‌ణామం (రామ‌జోగ‌య్య శాస్త్రి)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు – సాగ‌ర్ – శైల‌జ శైల‌జ‌(నేను శైల‌జ‌)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌ని – ర‌మ్య బెహ‌రా – రంగ్ దే (అ ఆ)

To Top

Send this to a friend