బాబుకు షాక్ ఇచ్చేందుకు శిల్పా రెడీ..


భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల సీటుపై ఇప్పడు అన్నిపార్టీలు దృష్టిసారించాయి. ఈ విషయంలో టీడీపీకి, వైసీపీకి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైసీపీ నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ సమయంలో టీడీపీ తరఫున పోటీచేసి నాగిరెడ్డి చేతిలో శిల్పా మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు భూమా మరణంతో ఖాళీ అయిన స్థానంలో టీడీపీ తరఫున చంద్రబాబు మళ్లీ భూమా కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

అయితే గతంలో టీడీపీ తరఫున పోటీచేసిన తనకే టికెట్ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబును వాయిదా వేసినట్టు తెలిసింది.. శిల్పాకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో శిల్పా మోహన్ రెడ్డి అలిగి చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలిసింది.

ఎమ్మెల్సీ ఆఫర్ నచ్చని శిల్పా జగన్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. దీనిపై పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించారట.. వారి నుంచి సానుకూల స్పందన రావడంతో జగన్ పార్టీలో చేరేందుకు శిల్పా ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో నంద్యాల ఎన్నిక రెబల్ పోటీ దారులతో చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలినట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend