చిన్నమ్మకు చిక్కులు.. పన్నీర్ దూకుడు..

ఐదురోజుల నుంచి తమిళనాట కొనసాగుతున్న సంక్షోభం కొనసాగుతూనే ఉంది. జయలలిత మృతి తర్వాత తమిళనాడు పీఠం కోసం పోరు సాగుతూనే ఉంది. మొదట చిన్నమ్మకు మద్దతిచ్చి అనంతరం తిరుగుబావుటా ఎగురవేసిన పన్నీర్ సెల్వం.. ఇప్పుడు శిశకళను చెడుగుడు ఆడుకుంటున్నారు. బీజేపీ అండదండలతో శశికళను సీఎం కాకుండా మోకాలడ్డుతున్నాడు.  ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. ఎమ్మెల్యేలందరిని క్యాంపు కు తరలించి జాగ్రత్తగా పావులు కదుపుతున్నా శశికళకు కాలం కలిసి రావడం లేదు. గవర్నర్, కేంద్రం శశికళను తమిళనాడు సీఎం చేయడానికి జాప్యం చేస్తోంది. ఆమెపై సుప్రీం కోర్టులో ఉన్న అక్రమాస్తుల కేసు తేలేవరకు జాప్యం చేయాలనే ఆలోచనతో కేంద్రం నిర్ణయం జాప్యం చేస్తోంది. ఇదే అదునుగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం చెలరేగిపోతున్నారు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా పోలీసులను ఆదేశించి.. శశికళ క్యాంపుకు తరలించిన ఎమ్మెల్యేలను విడిపించాలని ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు శశికళ క్యాంపుపై దాడి చేసి వారిని ముట్టడించింది. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సుప్రీం కేసే శశికళకు అడ్డు..

శశికళను సీఎం కాకుండా అడ్డుకుంటున్నది ప్రధానంగా ఆమెపై ఉన్న కేసు.. సుప్రీంలో అక్రమాస్తుల కేసులో ఆమె దోషిగా ఉన్నరు. ఆ తీర్పు వస్తే శశికళ జైలు కు వెళ్లాల్సిందే. ఈ పరిణామంతోనే గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమెను సీఎంను చేసేందుకు జాప్యం చేస్తున్నారు. ఆ తీర్పు వచ్చాకే ఆమెకు అధికారం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.

బీజేపీ మద్దతు పన్నీర్ కే..

మరోవైపు జయలలిత మరణం తర్వాత సీఎం పీఠామెక్కాలనుకున్న శశికళ ఆశలపై నీళ్లు చల్లింది బీజేపీ ప్రభుత్వమే.. అప్పుడే శశికళ సీఎం అవుదామనుకుంటే అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మోడీని కలిసి శరుణు జొచ్చడం.. ఆయన అభయం ఇవ్వడంపై.. శశికళ బ్యాచ్ పై ఐటీ దాడులు చేయడంతో అంతా సైలెంట్ అయ్యారు. దీంతో 2 నెలల పాటు పన్నీర్ సెల్వం తమిళనాడు సీఎంగా కొనసాగారు. వారం క్రితం పన్నీర్ తో రాజీనామా చేయించి గద్దెనెక్కాలని చూసిన శశికళ ఆశ నెరవేరకుండా బీజేపీ వెనుకలా నుంచి రాజకీయం చేసింది. పన్నీర్ తో తిరుగుబాటు చేయించి ఆయనకు అధికారం దక్కేలా వ్యూహం పన్నుతోంది. అందుకే 130 మంది ఎమ్మెల్యేలతో జాబితా ఇచ్చినా.. గవర్నర్ శశికళను సీఎంగా చేసేందుకు వెనుకాడుతుండడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉంది. శశికళపై కేసులు తేలేదాకా వేచిచూడాలని.. అదే సమయంలో పన్నీర్ ను సీఎం చేసేలా తోడ్పాటు నందించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే తమిళనాడులో ప్రస్తుతం నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, పన్నీర్ గేమ్ తో శశికళ సీఎం ఆశలు నెరవేరడం లేదు..

డీఎంకే –పన్నీర్ జట్టు..

మరోవైపు.. జయ నెచ్చలి శశికళను సీఎం కాకుండా తనవంతు తోడ్పాటునందిస్తున్నారు తమిళనాడు ప్రతిపక్ష నేత డీఎంకే చీఫ్ స్టాలిన్.. శశికళ సీఎం అయితే మరో జయలలిత లా మారి తమకే ముప్పు తెస్తుందని.. భావించి సౌమ్యుడు, మృధుస్వభావి అయిన పన్నీర్ నే సీఎం చేయాలని డీఎంకే పావులు కదుపుతోంది. స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి అసెంబ్లీలో బలపరీక్ష కు అనుమతి ఇవ్వాలని సూచించారు. ఇందులో డీఎంకే సపోర్టు పన్నీర్ కే ఇచ్చి ఆయన్ను సీఎం చేయాలనేది డీఎంకే ప్లాన్.. ఈ పరిణామాలతో 130 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా సరే.. డీఎంకే –పన్నీర్ జట్టు కట్టడంతో వారికే మొగ్గు కనపడుతోంది..

శశికళ ఎమ్మెల్యేల క్యాంపుపై పోలీసుల దాడి:

కాగా తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కు లేఖ అందించిన శశికళ.. ఎమ్మెల్యేలందరిని చైన్నైకి 120 కి.మీల దూరంలో రిసార్ట్ లో క్యాంపు ఏర్పాటు చేసింది. వారు స్వచ్ఛందంగా వెళ్లారని కొందరు.. లేదు శశికళ బలవంతంగా కిడ్నాప్ చేసిందని మరికొందరు పేర్కుంటున్నారు. ఒక ఎమ్మెల్యే భర్త తన భార్యను శశికళ కిడ్నాప్ చేసిందంటూ ఫిర్యాదు కూడా ఇచ్చింది. ఎమ్మెల్యేలను తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్న పన్నీర్ సెల్వం అపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పోలీసులను ఆదేశించి శశికళ క్యాంపుపై ఈ ఉదయం దాడి చేయించారు. వారిని విడిపించి కొంతమందిని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

తొందరపడిన గవర్నర్..

కాగా ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ నరసింహన్ తొందరపడడం లేదు. సుప్రీం తీర్పు వచ్చేదాకా గవర్నర్ శశికళను సీఎంను చేసే ఆలోచనలో లేరు.. న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. బీజేపీ పన్నీర్ కే పగ్గాలు అప్పగించాలని చూస్తుండడం కూడా శశికళ ఆశలపై నీళ్లు చల్లుతోంది. జయ ఉన్నప్పుడు తనకు వంగి నమస్కారం చెప్పిన పన్నీరే ఇప్పుడు శశికళకు ప్రత్యర్థిగా మారడంతో ఆమెకు దిక్కుతోచడం లేదు. ప్రస్తుతానికి కొద్దిరోజులు ఇలాగే పరిస్థితి కొనసాగవచ్చు.   హడావుడిగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో గవర్నర్ లేరు. దీంతో ప్రస్తుతానికి తమిళనాడులో స్తబ్ధత వాతావరణం కనిపిస్తోంది..

To Top

Send this to a friend