ఎస్.బీ.ఐ ‘ఆన్ లైన్’ చార్జీల బాదుడు..

దేశంలోనే లీడ్ బ్యాంకు అయిన ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్.బీ.ఐ) అంతర్జాతీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి నిలిచింది.. దేశంలోని 40శాతం జనాభా అకౌంట్లన్నీ ఈ బ్యాంకులోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఏప్రిల్ 1 న ఎస్.బీ.ఐ సంస్థ ప్రపంచంలోని 50 అగ్ర బ్యాంకుల జాబితాలో చేరింది. ఎస్.బీ.ఐలో ఇటీవలే స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, మైసూర్, పాటియాలా, జైపూర్ బికినీర్, ట్రావెన్ కోర్ బ్యాంకులు విలీనం అయ్యాయి. ఈ బ్యాంకులన్నీ ఏప్రిల్ 1 నుంచి ఎస్ బీఐ గా మార్పు చెందుతాయి. వినియోగదారులకు అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవలు.. అతి సాంకేతిక సేవలు ఎస్ బీఐ ద్వారా అందుతున్నాయి.

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఎస్బీఐతో మనం లావాదేవీలు చేసుకునేలా ప్రపంచ బ్యాంకుగా ఎస్.బీ.ఐగా మారింది. పెద్దగా ఎదిగిన ఎస్.బీ.ఐ ఇప్పుడు జీఎస్టీ అమలుతో వినియోగదారులపై బాదుడు మొదలు పెట్టింది. మొన్న జీఎస్టీ 18శాతాన్ని అమలు చేసి ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఎస్.బీ.ఐ ఇప్పుడు ఆన్ లైన్ నెట్ బ్యాంకింగ్ పైనా బాదుడు మొదలుపెట్టింది. జీఎస్టీని ఆన్ లైన్ బ్యాంకింగ్ కు అమలు చేసింది.

ఎస్.బీ.ఐ అధికారిక ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపిస్తే వారిపై జీఎస్టీ భారంతో పాటు చార్జీలను ప్రకటించింది. 1000 రూపాయల వరకు ఎలాంటి చార్జీల బాదుడు లేదు. రూ.1000 నుంచి 1 లక్షవరకు రూ.5+జీఎస్టీ, రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల డబ్బులు ట్రాన్స్ ఫర్లకు రూ.15 +జీఎస్టీ చార్జీలను ఖరారు చేశారు. ఈ బాదుడుతో వినియోగదారులందరూ షాక్ కు గురయ్యారు. ఎస్.బీ.ఐ చార్జీల మోతపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

To Top

Send this to a friend