చిరు మూవీ విషయంలో అదే సీన్‌ రిపీట్‌

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్‌ మరియు మీడియాలో దాదాపు మూడు సంవత్సరాల పాటు పతాక స్థాయిలో చర్చ జరిగింది. చివరి సంవత్సరం ఇంకా ఆ చర్చ పీక్స్‌కు చేరింది. సినిమా ప్రారంభం అయ్యే వరకు ఏ కథతో, ఎవరి దర్శకత్వంలో అంటూ మీడియాలో కుప్పలు కుప్పలుగా వార్తలు వచ్చాయి. ఆ దర్శకుడు, ఈ హీరోయిన్‌, కొత్త కథ, డబ్బింగ్‌ అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. చివరకు ‘ఖైదీ నెం.150’ చిత్రంతో చిరంజీవి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

‘ఖైదీ నెం.150’ చిత్రం విడుదల అయ్యిందో లేదో వెంటనే చిరు 151వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అంటూ ప్రకటించారు. స్వయంగా రామ్‌చరణ్‌ ఆ విషయాన్ని దృవీకరించాడు. సురేందర్‌ రెడ్డి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు అని, తాను నిర్మిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆగస్టు నుండి సినిమా ప్రారంభం అవుతుందని స్వయంగా రామ్‌ చరణ్‌ ప్రకటించాడు. అయితే సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

గత వారం పది రోజులుగా ఉయ్యాలవాడ ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యిందనే ప్రచారం వచ్చిన తర్వాత తాజాగా మెగా ఫ్యామిలీ నుండి చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ అంటూ మరోసారి ప్రకటన వచ్చింది. ఇదంతా చూస్తుంటే మెగా వర్గాల వారు చీప్‌ పబ్లిసిటీ కోరుకుని ఇలా 151వ సినిమా విషయంలో ఆటలు ఆడుతున్నారని, ఫ్యాన్స్‌ను చిరాకు పెడుతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. అప్పుడు 150 చిత్రం సమయంలో కూడా ఇలాగే మీడియాలో వస్తున్న వార్తలతో మెగా ఫ్యాన్స్‌ గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారు.

To Top

Send this to a friend